News March 15, 2025

గ్రూప్ – 3లో ఉద్యోగం సాధించిన అయిజ యువకుడు

image

అయిజ తెలుగుపేట కాలనీకి చెందిన దరెన్న, కృష్ణమ్మ దంపతుల కుమారుడు హరికృష్ణ ఇటీవల వెలువడిన గ్రూప్ – 3 ఫలితాల్లో 433వ ర్యాంక్ సాధించి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు. 2015-16లో బిటెక్ చేసి సాఫ్ట్ వేర్ రంగం వైపు వెళ్లకుండా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో గ్రూప్స్ కు ప్రిపేర్ అయ్యాడు. గ్రూప్ 3 జనరల్ విభాగంలో 433 వ ర్యాంకు సాధించాడు. దీంతో పలువురు హరికృష్ణను అభినందించారు.

Similar News

News February 28, 2026

‘6 గంటల నిద్ర’ సరిపోతుందా?

image

రాత్రిళ్లు తక్కువ సేపు నిద్రపోవడం ప్రమాదకరమే అంటున్నారు వైద్యులు. ‘రోజూ 6 గంటలే నిద్రపోతూ బానే ఉన్నాం అనుకోవడం భ్రమే. ఇలా 2 వారాల పాటు నిద్ర తగ్గిస్తే మెదడు రెండు రోజులు నిద్రలేని వ్యక్తిలాగే పనిచేస్తుంది. మన పనితీరు తగ్గుతున్నా మనకు తెలియదు. దీనివల్ల ఏకాగ్రత దెబ్బతిని, నిర్ణయాలు తీసుకోవడంలో తప్పులు జరుగుతాయి. మెదడు ఆరోగ్యం కోసం రోజుకు 7-9 గంటల నిద్ర తప్పనిసరి’ అని సూచిస్తున్నారు. SHARE IT

News February 28, 2026

విద్యార్థులకు ఇస్రో ‘యువికా’ ఆహ్వానం

image

అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు ఇస్రో యువికా 2026 కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు మార్చి 31లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారికి మే 11-22 వరకు వివిధ కేంద్రాల్లో ఉచిత శిక్షణ ఇస్తారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుంది. క్విజ్, మార్కులు, క్రీడల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని అధికారులు వెల్లడించారు.
వెబ్‌సైట్‌: isro.gov.in

News February 28, 2026

మాగుంట ప్రకటనతో కేజ్రీవాల్‌ను ఇరికించారు: జడ్జి

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై తీర్పు సందర్భంగా జడ్జి జస్టిస్ జితేంద్ర సింగ్ అప్పటి YCP, ప్రస్తుత TDP MP మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరును ప్రస్తావించారు. అప్రూవర్‌ మాగుంట ప్రకటన ఆధారంగా కేజ్రీవాల్‌ను కేసులో 18వ నిందితుడిగా చేర్చారన్నారు. అప్రూవర్ మాటలతో కేసులో ఎలా ఇరికిస్తారని CBIని ప్రశ్నించారు. వారికి ప్రయోజనాలను చేకూర్చేందుకే కేజ్రీ మద్యం విధానాన్ని మార్చారని చెప్పేందుకు CBI ప్రయత్నించిందన్నారు.