News March 12, 2025

గ్రూప్‌2 ఫలితాల్లో.. ADB వాసికి STATE 5TH ర్యాంక్

image

గ్రూప్‌2 ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన యువకులు సత్తా చాటారు. ఇందులో భాగంగా తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన చింతలపల్లి వెంకట్ రెడ్డి కుమారుడు చింతలపల్లి ప్రీతంరెడ్డి గ్రూప్‌2 ఫలితాల్లో 431 మార్కులు సాధించారు. కాగా రాష్ట్రస్థాయిలో ఐదో ర్యాంకు స్థానంలో నిలిచారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందించారు.

Similar News

News December 23, 2025

ADB: ‘ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి’

image

ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలియజేశారు. సోమవారం హైదరాబాదు నుంచి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి పాల్గొన్నారు. వచ్చే వారంలోగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో వృద్ధి నమోదు కావాలన్నారు. ఫారం-8 ద్వారా అసలైన ఫోటోగ్రాఫ్ సేకరించి నవీకరించాలని సూచించినట్లు శ్యామలాదేవి పేర్కొన్నారు.

News December 23, 2025

ADB: డాక్యుమెంట్ రైటర్‌పై కేసులు

image

ఆదిలాబాద్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో డాక్యుమెంట్ రైటర్‌గా పని చేస్తున్న సుభాష్ నగర్‌కు చెందిన వెన్నం నవీన్ పై 2 కేసులు నమోదు చేసినట్లు 2టౌన్ CI నాగరాజు తెలిపారు. సదానందం 2023లో కొనుగోలు చేసిన ప్లాటుకు సంబంధించిన దస్తావేజుల్లో హద్దులు సరిచేసి ఇవ్వటానికి రూ.లక్ష తీసుకున్నాడు. అదే విధంగా మరొకరి దగ్గర దస్తావేజుల్లోనూ మార్పులు చేయటానికి రూ.56వేలు తీసుకొని ఇబ్బందులకు గురిచేయగా బాధితులు ఫిర్యాదు చేశారు.

News December 23, 2025

ఉట్నూర్: 7 ఏళ్లకు లభించిన భూమి పట్టా

image

ఉట్నూర్ మండలం తాండ్ర గ్రామానికి చెందిన మండే మల్లారి, సండే సారూబాయ్‌లకు 7 సంవత్సరాలకు భూమి పట్టా లభించిందని ITDA PO యువరాజ్ మర్మాట్ తెలిపారు. సోమవారం పట్టాలను వారికి అందజేశారు. తాండ్ర గ్రామ శివారులో గల 49/23/1/2 సర్వే నంబర్‌లో 5.03 ఎకరాలు, 49/23/3 సర్వే నంబర్‌లో 5.03 ఎకరాల భూమి విస్తీర్ణానికి పట్టా చేసి లబ్ధిదారులకు మంజూరు చేశామన్నారు.