News August 28, 2025
గ్రేటర్లో అస్తవ్యస్తంగా జలమండలి నల్ల కనెక్షన్ మీటర్లు..!

గ్రేటర్ హైదరాబాద్‌లోని 14.07 లక్షల జలమండలి నల్లా కనెక్షన్లలో సగం మీటర్లు సరిగా పనిచేయడం లేదు. దీంతో వినియోగదారులకు బిల్లులు అస్తవ్యస్తంగా వస్తున్నాయని ఆరోపిస్తున్నారు. కొత్త మీటర్లు ఏర్పాటు చేసుకోవాలన్నా, పాడైన మీటర్లు మార్చుకోవాలన్నా సరైన పరిష్కారం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పరిష్కరించాలని వినియోగదారులు అధికారులను కోరుతున్నారు.
Similar News
News August 28, 2025
HYD: ఎవరూ చూడటంలేదని తోక జాడించకండి..!

గణేశ్ నవరాత్రుల సందర్భంగా మండపాలు, నిమజ్జనవేడుకల్లో యువతులు, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే పోకిరీల పని పట్టేందుకు SHE టీమ్స్ సిద్ధమైంది. మూడు కమిషనరేట్ల పరిధిలో అధికారులు, సిబ్బంది ప్రత్యేకంగా పోకిరీలపై నిఘా వేశారు. ఎవరూ చూడటం లేదని తోకజాడించాలని చూస్తే వారి కదలికలన్నీ పసిగడతాం అని స్పష్టం చేశారు. ఎక్కడైనా పోకిరీలు ఇబ్బంది పెడితే 94906 17444, 949061655, 8712662111 నెంబర్లకు కాల్ చేయాలన్నారు.
News August 28, 2025
మొన్న అలా.. నిన్న ఇలా: ఏమిటండీ కొండా గారూ?

బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కామెంట్స్ ఆ పార్టీలోనే చర్చనీయాంశమయ్యాయి. బీజేపీ నాయకులు తనతో ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారని.. అందుకే ఫుట్‌బాల్‌ను గిఫ్ట్‌గా పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శికి ఇవ్వడానికి తెచ్చానని మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో వ్యాఖ్యానించారు. అయితే బుధవారం దీనికి భిన్నంగా.. కాంగ్రెస్ పార్టీని ఎలా ఫుట్‌బాల్ ఆడుకోవాలో కార్యకర్తలకు చెప్పేందుకే ఇచ్చానని చెప్పడం ఆశ్చర్యకరం.
News August 28, 2025
భారత్‌తో వైరం.. ట్రంప్‌పై హౌస్ డెమోక్రాట్స్ ఫైర్

భారత్‌పై ట్రంప్ టారిఫ్స్ విధించడాన్ని అమెరికన్లు సైతం తప్పుపడుతున్నారు. తాజాగా హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ డెమోక్రాట్స్ ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు. ‘రష్యా నుంచి భారీగా ఆయిల్ కొంటున్న చైనా తదితర దేశాలపై టారిఫ్స్ వేయకుండా ఇండియానే టార్గెట్ చేస్తున్నారు. US-భారత్ సంబంధాలను దెబ్బతీస్తున్నారు. అమెరికన్స్‌కు నష్టం జరుగుతోంది. ఇది ఉక్రెయిన్ కోసం చేస్తున్నట్లు అనిపించట్లేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.