News January 4, 2025

గ్రేటర్‌లో గజగజ వణుకుతున్న పట్టణప్రజాలు

image

శివారు ప్రాంతాల్లో చలితీవ్రత పెరిగింది. పటాన్‌చెరులో అత్యల్పంగా 8.4 సెం.మీ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవ్వగా రాజేంద్రనగర్‌ ప్రాంతంలో 10 సెం.మీ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గ్రేటర్‌లోని సాధారణంగా 5 డిగ్రీల వరకు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చలిగాలులతో రాత్రుళ్లు బయట అడుగుపెట్టేందుకు ప్రజలు వణికిపోతున్నారు. బేగంపేటలో 13.6, దుండిగల్‌లో 13.8, హయత్‌నగర్‌లో 14, హకీంపేటలో 14.3 నమోదయ్యాయి.

Similar News

News January 6, 2025

హైదరాబాద్ జిల్లా కనిష్ఠ ఉష్ణోగ్రతలు

image

హైదరాబాద్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో వెస్ట్ మారేడ్‌పల్లిలో 13.3, సులేమాన్ నగర్ 13.6, గోల్కొండ 13.9, కంటోన్మెంట్ 14, షేక్‌పేట 14.2, మోండామార్కెట్ 14.4, లంగర్‌హౌస్ 14.6, ముషీరాబాద్ 14.8, రియాసత్‌నగర్ 14.8, చాంద్రయాణ గుట్ట 14.9, ఆసిఫ్‌నగర్‌లో 14.9℃గా నమోదైంది. కాగా ఈ ప్రాంతాలన్నింటికి వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

News January 6, 2025

చర్లపల్లి టర్మినల్ సేవలకు ఇదే కీలకం..!

image

చర్లపల్లి రైల్వే టర్మినల్ చుట్టూ చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. ఆయా ప్రాంతాల్లో పదేపదే అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. కిక్కిరిసిన రోడ్లతో ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అద్భుతంగా నిర్మించిన చర్లపల్లి టర్మినల్, మెరుగైన సేవలు అందించాలంటే, చుట్టూ ఉన్న రోడ్ల అభివృద్ధితో పాటు, భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

News January 5, 2025

HYDలో పరిగి కానిస్టేబుల్ సూసైడ్

image

HYDలో మరో కానిస్టేబుల్ సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. ఆదివారం HYD అంబర్‌పేటలోని తన నివాసంలో భాను శంకర్‌ ఉరి వేసుకున్నాడు. అయితే, భానుశంకర్‌ వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. గత వారం వ్యవధిలోనే ముగ్గురు పోలీసులు HYDలోనే సూసైడ్ చేసుకోవడం గమనార్హం. అయితే, భాను శంకర్‌ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.