News December 21, 2025
గ్రేటర్ ఎన్నికలు: 2011 జనాభా లెక్కలే ప్రామాణికం..?

మహానగరంలో ఎన్నికలు నిర్వహించాలంటే ముందు మొత్తం డివిజన్లకు రిజర్వేషన్లు కేటాయించాలి. ఏ డివిజన్ ఏ సామాజిక వర్గానికి కేటాయించాలనే దానిపై చర్చ సాగుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారమే వీటిని నిర్ణయించి ఎన్నికలకు వెళ్లే అవకాశముందని తెలిసింది. 45 వేల జనాభాకు అటు ఇటుగా నిర్ణయించి డివిజన్లను నిర్ణయించారు. ఆ తరువాత ఈ నివేదికను కేంద్రానికి నివేదించనున్నారు.
Similar News
News January 2, 2026
HYDలో ఎన్నికలు ఎప్పుడంటే?

గ్రేటర్ HYDను మూడు భాగాలు చేసే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం వాటికి ఎన్నికలు కూడా నిర్వహించనుంది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లను అధికారికంగా ఏర్పాటు చేసిన తర్వాత ఎన్నికలకు ఎప్పుడు వెళ్లాలనేదానిపై కాంగ్రెస్‌లో చర్చలు జరుగుతున్నాయి. ఎండా కాలం ముగిసిన తర్వాతే అంటే జూన్ తర్వాత ‘గ్రేటర్’ ఎలక్షన్స్ ఉండవచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుత కౌన్సిల్ గడువు వచ్చేనెల 10వరకు ఉంది.
News January 1, 2026
HYDలో కొత్త ట్రెండ్.. ఇదే బెస్ట్ స్పాట్..!

HYDలో ఏ వేడుక జరిగినా ఇప్పుడు అందరి చూపు డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ సెక్రటేరియట్ వైపే ఉంటోంది. IPLలో RCB విజయం, న్యూ ఇయర్ వేడుకలను సీపీ సజ్జనార్ ఇక్కడే జరుపుకోవటం విశేషం. సెక్రటేరియట్ అద్భుతమైన నిర్మాణ శైలి, విద్యుత్ వెలుగులతో ఈ ప్రాంతం పర్యాటకానికి ‘బెస్ట్ స్పాట్’గా మారింది. అమరజ్యోతి, భారీ అంబేడ్కర్ విగ్రహం, హుస్సేన్ సాగర్ అందాలను వీక్షించేందుకు సందర్శకులు పోటెత్తుతున్నారు.
News January 1, 2026
BREAKING.. RR: గురునానక్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. కాలేజీ హాస్టల్‌లో బీటెక్ విద్యార్థి రాము (20) అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురునానక్ కాలేజీలో రాము బీటెక్ ఫస్టియర్ చదువుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


