News December 27, 2025
గ్రేటర్ తిరుపతికి బ్రేకులు !

గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనను ప్రస్తుతం అమలు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. విజయవాడ, తిరుపతికి గ్రేటర్ హోదా ఇవ్వడంలో కొన్ని సాంకేతిక, చట్టపరమైన సమస్యలు ఉన్నాయని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. జనగణన పూర్తయ్యే వరకు డీలిమిటేషన్ చేపట్టవద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. జనగణన అనంతరం గ్రేటర్ తిరుపతి అంశంపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
Similar News
News December 31, 2025
JGL: జిల్లాలో తగ్గుముఖం పట్టిన నేరాలు

జిల్లాలో 2024తో పోలిస్తే 2025లో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గడం గమనార్హం. పోలీసు గణాంకాల ప్రకారం.. 2024లో జిల్లా వ్యాప్తంగా 5,919 కేసులు నమోదు కాగా, 2025లో ఆ సంఖ్య 5,620కి తగ్గింది. గతేడాది కంటే ఈసారి 299 కేసులు తక్కువగా నమోదయ్యాయి. వివిధ పోలీస్ స్టేషన్ల వారీగా చూస్తే.. జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యధికంగా 770 కేసులు నమోదయ్యాయి. బుగ్గారం పోలీస్ స్టేషన్ పరిధిలో 135 కేసులు నమోదయ్యాయి.
News December 31, 2025
వారికి 16సార్లు న్యూ ఇయర్

అంతరిక్షంలో ఉన్న అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌లోని వ్యోమగాములు 16సార్లు న్యూ ఇయర్‌కు స్వాగతం పలుకుతారు. గంటకు 28వేల కి.మీ. వేగంతో భూమి చుట్టూ తిరిగే ISS 90 నిమిషాల్లో ఎర్త్‌ని చుట్టేస్తుంది. అంటే రోజులో 16సార్లు భూమి చుట్టూ తిరుగుతూ 45 నిమిషాలకు ఓ పగలు, మరో 45ని.లకు రాత్రిని చూస్తారు. అలా న్యూ ఇయర్‌కూ వీరు 16సార్లు వెల్కమ్ చెబుతారన్నమాట. ప్రస్తుతం ISSలో ఏడుగురు ఆస్ట్రోనాట్స్ ఉన్నారు.
News December 31, 2025
వికారాబాద్: ఎలాంటి అపశృతి జరగకుండా చర్యలు: ఎస్పీ

నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అపశృతి జరగకుండా పోలీసులు బలగాలను మోహరించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులతో నూతన సంవత్సర బందోబస్తుపై సమీక్ష నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్ డ్రైవింగ్‌తో రోడ్లపై డ్రైవింగ్ చేయవద్దన్నారు. ప్రత్యేక బృందాలు పర్యవేక్షిస్తాయన్నారు.


