News December 26, 2025

గ్రేటర్ నయా రూపం ఇదే!

image

GHMC తాజా అధికారిక మ్యాప్ చూస్తుంటే సీన్ అర్థమవుతోంది. పాత వార్డుల లెక్కలకు చెల్లుచీటి రాస్తూ సరిహద్దుల పునర్విభజనతో సిటీ మ్యాప్ కొత్తగా మెరుస్తోంది. జనాభా పెరిగిన చోట వార్డులను ముక్కలు చేసి, పరిపాలన గల్లీ స్థాయికి చేరేలా స్కెచ్ వేశారు. శేరిలింగంపల్లి నుంచి ఉప్పల్, కుత్బుల్లాపూర్ నుంచి రాజేంద్రనగర్ వరకు పెరిగిన కాలనీలన్నీ ఇప్పుడు సరికొత్త సర్కిళ్లలోకి చేరాయి. మ్యాప్‌లో జోన్‌ల సరిహద్దులు మారాయి.

Similar News

News December 29, 2025

నెహ్రూ లేఖలను తిరిగి ఇచ్చేయండి: కేంద్రమంత్రి

image

జవహర్‌లాల్ నెహ్రూకు సంబంధించిన కీలక లేఖలు, పత్రాలు దేశ వారసత్వ సంపద అని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పష్టం చేశారు. వీటిని వెంటనే ‘ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ’కి తిరిగి అప్పగించాలని సోనియా గాంధీని కోరారు. అవి కుటుంబ ఆస్తి కాదని.. దేశ చరిత్రను తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందన్నారు. 2008లో దాదాపు 26,000 పత్రాలను తీసుకెళ్లారని.. గతంలో పలుమార్లు కోరినా తిరిగి ఇవ్వలేదని గుర్తు చేశారు.

News December 29, 2025

ఒంటిమిట్టలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పూర్తి: టీటీడీ

image

ఒంటిమిట్ట శ్రీకోదండ రామస్వామి ఆలయంలో ఈ నెల 30న జరగబోయే వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు పూర్తి అయినట్లు ఆదివారం TTD ఆలయ అధికారులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉత్తర ద్వారా దర్శనానికి వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు, చంటి బిడ్డల తల్లులు, వయోవృద్ధుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోనట్లు TTD AE అమర్నాథ్ రెడ్డి తెలిపారు. ఆరోజు భక్తులకు ప్రసాదం, అన్న ప్రసాదం అందుబాటులో ఉంటుందని TTD DEO ప్రశాంతి తెలియజేశారు.

News December 29, 2025

కామారెడ్డి: జిల్లాలో చలి తీవ్రం.. అప్రమత్తత అవసరం

image

కామారెడ్డి జిల్లాలో చలి ప్రభావం మళ్లీ ఎక్కువైంది. రానున్న మూడు రోజుల్లో 8.9 డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఆరంజ్ అలెర్ట్ లోనే కొనసాగుతున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం తెలిపింది. పిల్లలు, వృద్ధులు వెచ్చటి వస్త్రాలతో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. గాంధారి మండలంలోని పలు గ్రామాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.