News October 26, 2025
గ్రేటర్ వరంగల్ అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు

WGL నగర అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. నగర అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మేయర్ సుధారాణి తెలిపారు. నిధుల మంజూరుకు సహకరించిన జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, సీతక్క, MLAలు రాజేందర్ రెడ్డి, నాగరాజు, శ్రీహరిలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News October 28, 2025
PDPL: కోతిని మింగిన కొండచిలువ.. దాన్ని చంపిన వానరాలు

PDPL జిల్లా ముత్తారం(M) కేశనపల్లిలో కోతిని కొండచిలువ మింగేసింది. గ్రామానికి చెందిన చొప్పరి రవి ఇంట్లో చొరబడిన కొండచిలువ అక్కడేఉన్న కోతిని నోటకర్చుకొని మింగుతుండగా మిగితా కోతులొచ్చి దానిని కాపాడే ప్రయత్నం చేశాయి. కోతుల ప్రయత్నాలు విఫలం కావడంతో ఆ భారీ కొండచిలువ కోతిని మింగింది. ఈ క్రమంలో మిగితా కోతులన్నీ వచ్చి కొండచిలువపై దాడి చేసి దానిని చంపేశాయి. కాగా ఫారెస్ట్ అధికారులు కొండచిలువను పూడ్చిపెట్టారు.
News October 28, 2025
మీరు వాడే పసుపు నాణ్యమైనదేనా? ఇలా చెక్ చేయండి

అన్ని రకాల వంటల్లో పసుపుదే కీలకపాత్ర. అయితే ఇటీవల కల్తీ పసుపు మార్కెట్లోకి వస్తోంది. దీన్ని గుర్తించడానికి కొన్ని చిట్కాలున్నాయి. ఒక గ్లాసు వెచ్చని నీళ్లలో చెంచా పసుపు వేసి 20ని. ఉంచాలి. స్వచ్ఛమైనదైతే గ్లాస్ అడుగుకు పసుపు చేరుతుంది. పైకి తేలితే కల్తీ. అలాగే చేతిపైన కొద్దిగా పసుపు వేసి కాసేపు నలపాలి. మృదువుగా అనిపించి రంగు మారకుంటే నాణ్యమైనది. గరుకుగా ఉండి రంగు మారితే నకిలీ.
News October 28, 2025
PDPL: NOV 2 నుంచి గోదావరి మహా హారతి

కార్తీక మాసంలో నిర్వహించే గోదావరి మహా హారతి కార్యక్రమం NOV 2న మంథని నుంచి ప్రారంభిస్తున్నట్లు ఉత్సవ కమిటీ రాష్ట్ర కార్యదర్శి క్యాతం వెంకటరమణ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 6న అంతర్గాంలో, 9న ధర్మపురిలో, 12న గోదావరిఖనిలో నిర్వహించే గోదావరి మహా హారతి సందర్భంగా భక్తులు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు. BJP జాతీయ నాయకులు మురళీధర్ రావు నేతృత్వంలో ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు.


