News October 15, 2025
గ్రేటర్ విజయవాడ సాధ్యమయ్యేనా..?

విజయవాడ కార్పొరేషన్‌ను గ్రేటర్ విజయవాడగా మార్చాలని 2017లోనే ప్రతిపాదించారు. విజయవాడకు ఆనుకుని ఉన్న పెనమలూరు, గన్నవరం నియోజకవర్గంలోని 45-50 గ్రామాలను గ్రేటర్లో కలపాలని ప్రణాళిక వేశారు. నగర విస్తరణ 62KM నుంచి 165KM చేరుకుంటుంది. అయితే అడుగు ముందుకు పడలేదు. ప్రస్తుతం గ్రేటర్ విజయవాడ కంటే అమరావతికి ప్రాధాన్యం ఇస్తున్నారన్న చర్చ నడుస్తోంది. దీంతో ఇప్పట్లో గ్రేటర్ విజయవాడ కల నెరవేరేలా కనిపించడం లేదు.
Similar News
News October 15, 2025
మేడిగడ్డ పునరుద్ధరణకు వడివడిగా అడుగులు

TG: వరదల్లో దెబ్బతిన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులకు ప్రభుత్వం చురుగ్గా కదులుతోంది. పునరుద్ధరణ ప్లాన్, డిజైన్లకోసం బిడ్ల దాఖలు నేటితో ముగియనుంది. HYD, మద్రాస్, రూర్కీ IITలు టెండర్లు దాఖలు చేశాయి. మరికొన్ని ప్రముఖ సంస్థలు కూడా బిడ్లు వేసేందుకు రెడీగా ఉండడంతో గడువు పొడిగించడంపై ఆలోచిస్తోంది. NDSA సిఫార్సులకు అనుగుణంగా ఉన్న బిడ్‌ను ఆమోదించి నిర్మాణ పనులకు టెండర్లు పిలవనుంది.
News October 15, 2025
ఒంగోలులో వ్యక్తి మిస్సింగ్.. ఎక్కడైనా చూశారా..!

ఒంగోలు పరిధిలోని శ్రీనగర్ కాలనీ ఒకటవ లైన్‌లో ఉండే భూమిరెడ్డి శ్రీనివాసరెడ్డి (దేవుడు) ఆదివారం మిస్ అయినట్లు ఒంగోలు తాలూకా PSలో ఫిర్యాదు అందింది. మిస్ అయిన వ్యక్తి భార్య వివరాల ప్రకారం.. పొన్నలూరు మండలం కొత్తపాలెంకి చెందిన శ్రీనివాసరెడ్డి ఒంగోలులో స్థిరపడ్డారు. కాగా ఆదివారం బ్యాంక్‌లో క్రాఫ్‌లోన్ కట్టేందుకు స్వగ్రామానికి వెళ్లున్నానని వెళ్లాడన్నారు. వివరాలు తెలిస్తే 9177688912కు కాల్ చేయాలన్నారు.
News October 15, 2025
మల్లోజులకు అడవిబాట ఏటూరునాగారమే..!

మావోయిస్టు అగ్రనేత, సీసీ కమిటీ మెంబర్ మల్లోజుల వేణుగోపాల్@అభయ్ మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ ఎదుట లొంగిపోయారు. ఆయనతోపాటు 60 మంది వివిధ కేడర్లలో పనిచేసే సభ్యులతో పాటు ఆయన జనజీవన స్రవంతిలో కలవనున్నారు. అయితే మల్లోజుల 1981లో అజ్ఞాతంలోకి వెళ్లారు. అప్పటి పీపుల్స్ వారు పార్టీలో చేరి ఏటూరునాగారం దళంలో సభ్యుడిగా చేరారు. సభ్యుడి స్థాయి నుంచి పోలిట్ బ్యూరో స్థాయికి ఎదిగారు.