News January 12, 2026
గ్రేటర్ విశాఖ బడ్జెట్ ఎంతంటే?

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 2026–27 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్‌కు స్థాయి సంఘం ఆమోదం తెలిపింది. మొత్తం బడ్జెట్ పరిమాణం రూ.4047.12 కోట్లుగా నిర్ణయించారు. ప్రారంభ నిల్వగా రూ.365.96 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. మొత్తం జమలు రూ.4180.37 కోట్లు కాగా, వ్యయం రూ.4047.12 కోట్లుగా అంచనా వేశారు. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ బడ్జెట్‌ను స్థాయి సంఘం ఆమోదించింది.
Similar News
News January 22, 2026
విశాఖ: కాంబోడియాకు యువతను తరలిస్తున్న వ్యక్తిపై పీడీ యాక్ట్

కాంబోడియాకు యువతను విశాఖ నుంచి తరలిస్తున్న ప్రధాన ఏజెంటు బొంగు మురళిని వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. స్థానికంగా భావన ఫ్యాబ్రికేటర్స్ వర్క్ ఏర్పాటు చేసి ఉపాధి పేరుతో యువకులను కాంబోడియా తరలిస్తుండగా గతంలో అరెస్టు చేశారు. మరోసారి తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆయనపై పీడీ యాక్ట్ పెడుతున్నట్లు తెలిపారు.
News January 21, 2026
జీవీఎంసీ సేవలకు సహకరించండి: కమిషనర్

విశాఖ నగర అభివృద్ధి, స్వచ్ఛ సర్వేక్షన్-2025లో ఉత్తమ ర్యాంకు సాధనకు నివాసిత సంక్షేమ సంఘాలు (RWAs) సహకరించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ కోరారు. బుధవారం జరిగిన సమావేశంలో సంఘాల ప్రతినిధులు రోడ్లు, డ్రైనేజీ, పార్కుల సమస్యలను ప్రస్తావించారు. సమస్యల తక్షణ పరిష్కారానికి ‘పురమిత్ర’ యాప్ టోల్ ఫ్రీ నంబర్‌ను వినియోగించుకోవాలన్నారు. కాలనీల్లోని పార్కుల నిర్వహణ బాధ్యతను సంఘాలే తీసుకోవాలని సూచించారు.
News January 21, 2026
గోపాలపట్నం రైల్వే ట్రాక్‌పై వ్యక్తి ఆత్మహత్య

గోపాలపట్నం రైల్వే ట్రాక్‌పై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం కొత్తపాలెం-గోపాలపట్నం రైల్వే క్యాబిన్ వద్ద బాడీ పట్టాలపై ఉండడానికి గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గోపాలపట్నం పోలీసులు, రైల్వే పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. మృతుడు గోపాలపట్నం లోని మెడికల్ షాప్ నిర్వహిస్తున్న సాయి కృష్ణగా స్థానికులు గుర్తించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.


