News November 24, 2024

గ్రేటర్ హైదరాబాద్‌లో హాస్టళ్లపై ఆకస్మిక తనిఖీలు

image

హుమయూన్‌నగర్‌లోని తెలంగాణ మైనార్టీ పాఠశాల బాలుర -1ను ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రమేశ్ ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్‌లోని వంటగది, భోజనశాల, స్టోర్‌రూమ్, పడకగదులు, ప్రొవిజన్స్, హాస్టల్ రిజస్టర్‌లను పరిశీలించారు. పిల్లలతో కలసి ఆయన టిఫిన్ చేశారు. టిఫిన్స్ ఎలా ఉన్నాయని విద్యార్థులతో అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ నిర్వహణ బాగుందని ఆయన ప్రశంసించారు.

Similar News

News November 14, 2025

జూబ్లీ బైపోల్: ఆ నలుగురిలో NOTA!

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో NOTA ప్రధాన పార్టీల సరసన నిలిచింది. 58 మంది అభ్యర్థులతో పాటు పోటీ చేసిన NOTA ఫలితాల్లో 4వ స్థానం దక్కించుకుంది. INC, BRS, BJP తర్వాత అత్యధికంగా ఏ గుర్తుకైనా ఓట్లు వచ్చాయంటే అది నోటాకే. None of the Above అంటూ 924 మంది ఓటర్లు బటన్ నొక్కారు. ఇతర పార్టీల అభ్యర్థులతో సహా ఏ ఇండిపెండెంట్‌ కూడా నోటా ఓట్లలో 25 శాతం అయినా దక్కించుకోలేదు.

News November 14, 2025

GREAT: HYD విద్యార్థినికి అరుదైన గౌరవం

image

బేగంపేటకు చెందిన 9వ తరగతి విద్యార్థిని ఆకర్షణకు అరుదైన గౌరవం దక్కింది. బుక్ రీడింగ్‌పై విద్యార్థులకు ఆసక్తి కల్పించడమే కాక 24 లైబ్రరీలను వివిధ చోట్ల ఏర్పాటు చేసిన ఆకర్షణ యంగ్ అచీవర్స్ అవార్డుకు ఎంపికైంది. ఈ నెల 15న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఆకర్షణ ఈ అవార్డు అందుకోనుంది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు 24 లైబ్రరీలను ఏర్పాటుచేసింది. గతంలో ప్రధాని మోదీ కూడా ఈ విద్యార్థిని అభినందించారు.

News November 14, 2025

జూబ్లీహిల్స్‌లో బీసీ నినాదం పనిచేసిందా..?

image

జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ విజయానికి బీసీ నినాదం కూడా ప్రధానంగా పనిచేసిందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. BRS అభ్యర్థి మాగంటి సునీత కమ్మ వర్గానికి చెందిన మహిళ కావడం, BJP అభ్యర్థి లంకల దీపక్.. రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి కావడం నవీన్ యాదవ్‌కు కలిసొచ్చింది. నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న మైనార్టీ ఓట్లతో పాటు మిగితా బీసీ ఓటర్లు నవీన్‌కే జై కొట్టారు. దీంతో భారీ మెజార్టీతో గెలిచారని వారు అంటున్నారు.