News August 13, 2024
గ్రేటర్ HYDలో ఆ వాహనాలు 15 లక్షలకు పైనే..!

గ్రేటర్ HYD పరిధిలో దాదాపుగా 75 లక్షల వాహనాలు ఉన్నట్లుగా అధికారుల లెక్కల్లో తేలింది. రూ.170 కోట్ల లీటర్ల పెట్రోలు, రూ.150 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగం జరుగుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే..15 ఏళ్లకు పైబడిన వాహనాలు దాదాపుగా 15 లక్షలకు పైగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ వాహనాల వల్ల గాలి కాలుష్యం పెరిగి, ప్రజలు శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు.
Similar News
News September 17, 2025
చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద సంచిలో మహిళ డెడ్‌బాడీ

చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ మృతదేహం కలకలం రేపింది. దుండగులు ఆమెను హత్య చేసి, సంచిలో కుక్కి ఆటో స్టాండ్ వద్ద పడేసి వెళ్లినట్లు తెలుస్తోంది. మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు చేసి దర్యాప్తు చేపట్టారు.
News September 17, 2025
HYD: SEP 17.. పేర్లు మార్చిన పార్టీలు!

ఆపరేషన్ పోలోలో భాగంగా 1948, SEP 17న HYD సంస్థానం భారత్‌లో విలీనమైంది. ఇది జరిగి 77 ఏళ్లు పూర్తయినా ఏటా కొత్త చర్చనే. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం అని INC, విమోచనమని BJP అధికారికంగా వేడుకలు చేస్తోంది. ఇక సాయుధ పోరాటమని కమ్యూనిస్టులు, జాతీయ సమైక్యత అని BRS-MIM నేతలు వాదిస్తున్నారు. ఇటువంటి భిన్నాభిప్రాయాల మధ్య ‘SEP 17’ రాజకీయ బల ప్రదర్శనకు వేదికవుతోంది. తీరొక్క పేరుతో ఒకే కార్యక్రమం చేయడం గమనార్హం.
News September 17, 2025
హైదరాబాద్ సంస్థానం.. తెలంగాణ ప్రస్థానం

8 తెలుగు, 3 కన్నడ, 5 మరాఠీ జిల్లాల సమూహమే హైదరాబాద్ సంస్థానం. దేశంలోని 550 సంస్థానాల్లో అతిపెద్దది. నాడు కోటీ 80 లక్షల జనం ఉంటే ఇందులో 50 శాతం తెలుగువారే. 25 శాతం మరాఠీ, 12 శాతం ఉర్దూ, 11 శాతం కన్నడ, ఇతర భాషాల వారు HYD సంస్థానంలో ఉండేవారు. ప్రపంచంలోనే ధనికుల్లో ‘నిజాం’ ఒకడిగా ఉండేవారని చరిత్ర చెబుతోంది. 1948 SEP 17న ఈ సంస్థానం ఆపరేషన్ పోలోతో భారత్‌లో విలీనమైంది. తెలంగాణ ప్రస్థానం మొదలైంది.