News February 1, 2025
గ్రేటర్ HYDలో గాలి నాణ్యత కేంద్రాలు ఉన్నవి అక్కడే!
గ్రేటర్ HYDలో గాలి నాణ్యతను పరీక్షించేందుకు ఉన్న కేంద్రాల లిస్టును CPCB అధికారులు వెల్లడించారు. న్యూ మలక్‌పేట, నాచారం-TSIIC, సోమాజిగూడ, ఈసీఐఎల్- కాప్రా, కొంపల్లి, కోకాపేట, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, సనత్ నగర్, ఇక్రిశాట్, పటాన్ చెరు, జవహర్ జూపార్క్ మొత్తంగా ప్రాంతంలో ఎప్పటికప్పుడు ఎయిర్ పొల్యూషన్ చెక్ చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News February 1, 2025
HYD: WOW.. త్వరలో అద్భుతమైన పార్క్ ఓపెన్!
HYD నగరంలో 85 ఎకరాల్లో విస్తరించి ఉన్న హిమాయత్ సాగర్, కొత్వాల్ గూడ పార్క్ త్వరలో ఓపెన్ కానుంది. దాదాపుగా 1000 రకాల పక్షులతో పక్షిశాలను సైతం సిద్ధం చేయగా.. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించేందుకు అధికారిక యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది. ఎక్వేరియం, పిక్నిక్ పార్కు, రిసార్టులు, అడ్వెంచర్లు, ఫుడ్ కోర్టులు, ఓపెన్ థియేటర్లు అందుబాటులో ఉంచారు.
News February 1, 2025
HYD: రోల్ మోడల్‌గా తెలంగాణ
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సర్వేలో తెలంగాణ అనేక అంశాల్లో ఆదర్శంగా నిలిచింది. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచి తెలంగాణ ఘనతను చాటింది. అనేక పథకాల అమలు, వినూత్న పథకాల అమలులో ముందుందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన ఆర్థిక సర్వేలో తెలంగాణకు సంబంధించిన పలు అంశాలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి.
News February 1, 2025
HYD: R&B ఛీప్ ఇంజినీర్లతో మంత్రి కోమటిరెడ్డి నివాసంలో సమావేశం
ఆర్ & బీ ఛీఫ్ ఇంజినీర్లతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో సమావేశం నిర్వహించారు. అటవీ అనుమతులతో పెండింగ్‌లో ఉన్న రహదారులపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. రహదారి, భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, పనుల్లో వేగం పెంచి ప్రగతి చూపిస్తేనే, మరిన్ని నిధులు సాధించవచ్చని అధికారాలకు మంత్రి దిశానిర్ధేశం చేశారు.