News October 9, 2024
గ్రేటర్ HYDలో వ్యర్ధాల నిర్వహణకు కమాండ్ కంట్రోల్
గ్రేటర్‌లో ఘన వ్యర్ధాల నిర్వహణకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు GHMC కమిషనర్ తెలిపారు. వ్యర్ధాల నిర్వహణలో ప్రపంచ స్థాయి ప్రమాణాలు పాటించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు వ్యర్ధాల నిర్వహణపై GHMC కమిషనర్ ఆమ్రపాలి అధ్యక్షతన సమావేశం జరిగింది. 11 మంది ఆపరేటర్లు నూతన టెక్నాలజీని వివరించారు. ఈ టెక్నాలజీతో గార్బేజి కలెక్షన్, స్ట్రీట్ స్వీపింగ్, ఫిర్యాదుల పరిష్కారం సులభతరం కానుంది.
Similar News
News December 21, 2024
HYD: నేడు ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు
ఎల్బీ స్టేడియంలో నేడు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో సాయంత్రం క్రిస్మస్ వేడుకలను నిర్వహించనుంది. ఈ క్రిస్మస్ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. సీఎంతో పాటు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరుకాన్నారు. ప్రభుత్వం తరఫున క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తుండడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
News December 21, 2024
రాష్ట్రపతి నిలయానికి వారికి స్పెషల్ ఎంట్రీ
రాష్ట్రపతి నిలయం సందర్శనకు వసతి గృహాల విద్యార్థులకు ప్రత్యేక ప్రవేశం కల్పించనున్నారు. పిక్నిక్ స్పాట్‌లా ఉండేలా పిల్లలకు ప్లే ఏరియా, ఉద్యాన ఉత్సవాన్ని తిలకించేందుకు వసతి గృహాల విద్యార్థులను రాష్ట్రపతి నిలయానికి తీసుకువచ్చి ఆహ్లాదకర వాతావరణంలో జ్ఞాపకాలు గుర్తుండిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైన తాగునీరు, అంబులెన్స్, మొబైల్ టాయిలెట్లు, రవాణా, లైటింగ్ వంటి మౌళిక వసతులు కల్పిస్తున్నారు.
News December 21, 2024
HYD: పిక్నిక్ స్పాట్‌లా రాష్ట్రపతి భవన్
ఈసారి రాష్ట్రపతి భవన్ పిక్నిక్ స్పాట్‌లా సందర్శకులను ఆకట్టుకోనుంది. ‘ఉద్యాన ఉత్సవ్’ పేరుతో ఆహ్లాదకర వాతావరణంలో వ్యవసాయ, సాంస్కృతిక, పర్యాటక శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక భౌగోళిక వ్యవసాయం, వ్యవసాయం సమీకరణ, కుటీరాలను, స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. నిర్దేశిత పంటలు, వ్యర్థాలతో ఉపయోగాల తయారీ, ఇళ్లల్లో నర్సరీ, గార్డెనింగ్‌లో మెళకువలు సహా అనేక స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు.