News January 18, 2026
గ్రేటర్ HYDలో 20న ఆటోల బంద్!

నగర వ్యాప్తంగా జనవరి 20న ఆటోల బంద్‌కు పిలుపునిస్తున్నట్లు మహాత్మా గాంధీ ఆటో డ్రైవర్ల జేఏసీ కన్వీనర్ మహమ్మద్ తెలిపారు. ఉచిత బస్సు పథకంతో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలకు నిరసనగా, ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఆటో డ్రైవర్లతో భారీ ధర్నా చేపడతామని ప్రకటించారు. ప్రభుత్వమే స్పందించి తమ డిమాండ్లు పరిష్కరించాలని ఆయన కోరారు.
Similar News
News April 1, 2026
నేటి నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం

ఈరోజు నుంచి కొత్త ఐటీ చట్టం అమలులోకి వస్తుంది. దీంతో HYDలో ఉద్యోగులకు ప్రస్తుతం మూలవేతనంలో 40%గా ఉన్న HRA 50%కు పెరగనుంది. ఇకపై HRA క్లెయిమ్ చేసేటప్పుడు యజమాని వివరాలు తప్పనిసరిగా సమర్పించాలి. వార్షిక వడ్డీ ఆదాయం ₹50వేలు మించితే TDS వర్తించనుంది. పిల్లల హాస్టల్ బిల్లు మినహాయింపు ₹300 నుంచి ₹9వేలకు పెరగనుంది. ఉద్యోగులకు ఇచ్చే వార్షిక బహుమతుల పన్ను మినహాయింపు పరిమితి ₹5వేల నుంచి ₹15వేలకు పెరగనుంది.
News April 1, 2026
తిరుపతిలో వ్యభిచారం.. దొరికిపోయిన మహిళలు

తిరుపతి పద్మావతి నగర్, ఎస్బీఐ బ్యాంక్ కాలనీలోని వ్యభిచార గృహంపై తిరుచానూరు పోలీసులు మంగళవారం రాత్రి మెరుపు దాడి చేశారు. ముగ్గురు మహిళలతో పాటు ఓ విటుడు, వ్యభిచార గృహం నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో పోలీసులు ఈ దాడి చేశారు. తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
News April 1, 2026
జలవివాదాల్లో జోక్యం చేసుకోలేం: కృష్ణా బోర్డు

తెలుగు రాష్ట్రాల జలవివాదాల్లో జోక్యం చేసుకోలేమని కృష్ణా నది యాజమాన్య బోర్డు స్పష్టం చేసింది. నీటి పంపిణీపై ప్రస్తుతం జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్‌లో విచారణ జరుగుతోందని.. ఇప్పుడు జోక్యం చేసుకుంటే అది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని తెలిపింది. శ్రీశైలం-నాగార్జున సాగర్‌లోని కృష్ణా జలాల వాడకం, విద్యుత్ ఉత్పత్తిపై ఏపీని నిలువరించాలన్న తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిపై ఈ మేరకు స్పందించింది.


