News September 19, 2025
గ్రేటర్ HYD అధికారులకు మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

భారీ వర్షాల నేపథ్యంలో HYD ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు ఈరోజు కీలక ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలు కురుస్తుండటతో వరద నీరు సిటీ రోడ్లను ముంచెత్తుతోందని, ఎక్కడెక్కడ మ్యాన్ హోళ్లకు మూతలు లేవో అర్థం కావడం లేదన్నారు. మ్యాన్ హోల్స్ వద్ద తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలను అప్రమత్తం చేయాలని జీహెచ్ఎంసీ సిబ్బందిని ఆదేశించారు. ముఖ్యంగా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు.
Similar News
News September 19, 2025
జూబ్లీహిల్స్‌లో ఆసక్తికరంగా కాంగ్రెస్ సమీకరణలు..!

HYD జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సమీకరణలు ఆసక్తికరంగా మారాయి. శుక్రవారం మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ హామీ పేరుతో కరపత్రాలు దర్శనమిచ్చాయి. దీంతో జూబ్లీహిల్స్‌లో అంజన్ కుమార్ యాదవ్ ప్రచారం ప్రారంభించినట్లు తెలుస్తోంది. అన్ని డివిజన్ల నేతలతో అంజన్ కుమార్ యాదవ్ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. హైకమాండ్ వద్ద నుంచి అంజన్ కుమార్ యాదవ్‌కు సానుకూల సంకేతాలు వచ్చాయని ఆయన అనుచరులు చెబుతున్నారు.
News September 19, 2025
HYD: ఎకో టూరిజం ప్రాజెక్ట్ స్క్రీనింగ్ కమిటీ భేటీ

HYDలో ఎకో టూరిజం ప్రాజెక్ట్ స్క్రీనింగ్ కమిటీ ఈరోజు భేటీ అయ్యింది. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ పాల్గొని అధికారులకు కీలక సూచనలు చేశారు. పలు ప్రాంతాల్లో ఎకో టూరిజం ప్రాజెక్ట్‌లపై చర్చ జరుగుతోంది. తెలంగాణ టూరిజాన్ని దేశవ్యాప్తంగా ఫేమస్ చేయాలని, టూరిజం ద్వారానే మరిన్ని పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని మంత్రి కొండా సురేఖ తెలిపారు.
News September 19, 2025
HYD: సచివాలయంలో హెల్త్ మినిస్టర్ సమీక్ష

HYDలోని తెలంగాణ సచివాలయంలో మంత్రి దామోదర రాజనర్సింహ ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆస్పత్రుల నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో చర్చ సాగుతోంది. కొత్తగా నిర్మిస్తోన్న ఆసుపత్రులతోపాటు మరికొన్ని ఆస్పత్రులు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.