News May 22, 2024

గ్రేటర్ HYD అమృత్ ప్రాజెక్టు కోసం 5 పార్కుల ఎంపిక

image

అమృత్ ప్రాజెక్టును అమలు చేయడానికి ప్రయోగాత్మకంగా గ్రేటర్ HYD నగరంలో చేపట్టేందుకు జీహెచ్ఎంసీ 5 మున్సిపల్ పార్కులను ఎంపిక చేసింది. HYD నగరంలోని ఖైరతాబాద్ జోన్‌లో కేఎల్ఎన్ యాదవ్ పార్కు, శేరిలింగంపల్లి జోన్లో టెక్నో పార్క్, సికింద్రాబాద్ జోన్లో ఇందిరా పార్కు, ఎల్బీనగర్ జోన్లో హబ్సిగూడలోని కాకతీయ నగర్ కాలనీ పార్కు, సైనిక్‌పురిలోని ఈ-సెక్టార్ పార్కులు.. పైలెట్ ప్రాజెక్టులో ఉన్నాయి.

Similar News

News September 14, 2025

ఖైరతాబాద్: ‘ఈ నెల 24న బీసీ బతుకమ్మ నిర్వహిస్తాం’

image

ఈ నెల 24న ట్యాంక్ బండ్‌పై బీసీ బతుకమ్మను ఘనంగా నిర్వహిస్తామని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. వేలాది మంది మహిళలు బీసీ బతుకమ్మ వేడుకలో పాలుపంచుకుంటారన్నారు. ఈ కార్యక్రమానికి అందరూ హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని కోరారు.

News September 14, 2025

HYD: ఈ ఫార్ములా కేస్.. విజిలెన్స్ కమిషన్ పరిధిలోకి బాల్

image

గత ప్రభుత్వం HYDలో నిర్వహించిన ఈ ఫార్ములా కార్ రేసులో భారీ అవినీతి జరిగిందని అవినీతి నిరోధక శాఖ పేర్కొంది. ఇందుకు సంబంధించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించి తదుపరి విచారణకు అనుమతివ్వాలని కోరింది. అయితే ప్రభుత్వం ఈ రిపోర్టును విజిలెన్స్ కమిషన్‌కు పంపి తీసుకోవాల్సిన చర్యలపై అభిప్రాయం కోరింది. విజిలెన్స్ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ కేసుపై చర్యలు తీసుకోనుంది.

News September 14, 2025

చిన్నారుల జీవితాల్లో ఆశలు కల్పిస్తున్న నిమ్స్

image

గుండె సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు నిమ్స్‌లో నేటి నుంచి ఆపరేషన్లు నిర్వహించనున్నారు. బ్రిటన్ వైద్యులు ఏటా సెప్టెంబరులో ఈ చికిత్సలు చేస్తారు. ఈనెల 20వ తేదీ వరకు క్లిష్టమైన ఆపరేషన్లను చేస్తారు. నిమ్స్ కార్డియోథొరాసిక్ డాక్టర్ల సహకారంతో ఈ వైద్యం అందించనున్నారని కార్డియోథొరాసిక్ హెడ్ డా.అమరేశ్వర్ రావు తెలిపారు.