News November 13, 2025
గ్రేట్.. రాష్ట్రంలోనే నల్గొండకు రెండో స్థానం

జల్ సంచయ్ – జల్ భాగీదారీ పథకం కింద నల్గొండ జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచి అవార్డుకు ఎంపికైంది. ఈ నెల 18న రాష్ట్రపతి చేతుల మీదుగా కలెక్టర్ ఇలా త్రిపాఠి, డీఆర్డీవో శేఖర్ రెడ్డి అవార్డులో పాటు రూ.2 కోట్ల నగదు బహుమతిని అందుకోనున్నారు. అయితే జల సంరక్షణ కోసం తిరుమలగిరి సాగర్ (M)లో అత్యధికంగా 3,678 పనులు చేపట్టగా, నాంపల్లి (M)లో 3,628 పనులు చేశారు. జిల్లా వ్యాప్తంగా 84,827 పనులు చేపట్టారు.
Similar News
News November 13, 2025
మెదక్: చలి చంపేస్తోంది బాబోయ్!

ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో తెల్లవారుజామున పనిచేసే పారిశుధ్య కార్మికులు, పాల, కూరగాయల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, ఆస్తమా రోగులు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్యులు సూచించారు.
News November 13, 2025
ఢిల్లీ పేలుడు.. కారులో డీఎన్ఏ ఉమర్‌దే!

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కారు బ్లాస్ట్‌లో మరణించింది డాక్టర్ ఉమర్ అని అధికార వర్గాలు తెలిపాయని INDIA TODAY పేర్కొంది. కారులోని డీఎన్ఏ, ఉమర్ కుటుంబ సభ్యులతో సరిపోలిందని వెల్లడించింది. i20 కారుతో ఎర్రకోట సిగ్నల్ వద్ద ఆత్మహుతి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 12 మంది మరణించారు. కాగా ఉమర్ పేరిట ఉన్న మరో కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
News November 13, 2025
HYD: స్పాలో అమ్మాయిలతో అబ్బాయిలకు మసాజ్

డిఫెన్స్ కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న జెనోరా స్పా మసాజ్ సెంటర్‌పై నేరేడ్‌మెట్ పోలీసులు దాడులు చేశారు. ఈ స్పాలో నిబంధనలకు విరుద్ధంగా మహిళా థెరపిస్ట్‌లతో పురుషులకు క్రాస్ మసాజ్‌లు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. స్పా యజమాని, మేనేజర్‌పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అవసరమైన అనుమతులు లేకుండా నడిపినందుకు సంబంధిత పత్రాలు, సీసీ ఫుటేజ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


