News January 8, 2026
గ్రోక్ వివాదం.. కేంద్రానికి ‘X’ నివేదిక

‘X’లో <<18744769>>అశ్లీల కంటెంట్<<>> అంశం కేంద్రానికి చేరిన విషయం తెలిసిందే. అలాంటి కంటెంట్‌ను తొలగించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. తాజాగా బుధవారం సాయంత్రానికి ఎక్స్ తన రిపోర్టును సమర్పించింది. దీనిని ఐటీ శాఖ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. Grokను దుర్వినియోగం చేసే యూజర్లపై కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే సదరు సంస్థ హెచ్చరించింది.
Similar News
News February 20, 2026
Pax Silicaలోకి భారత్.. ఏంటీ కూటమి?

భారత్ ‘Pax Silica’ డిక్లరేషన్‌లో చేరింది. సెమీకండక్టర్ సప్లై చైన్, AI వంటి కీలక సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడమే ఈ ఒప్పంద ఉద్దేశం. గ్లోబల్ చిప్ తయారీలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించి, ప్రజాస్వామ్య దేశాల మధ్య సురక్షితమైన, నమ్మదగిన టెక్నాలజీ నెట్‌వర్క్‌ను నిర్మించాలని ఈ కూటమి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్ణయం ద్వారా భారత్ గ్లోబల్ సెమీకండక్టర్ హబ్‌గా ఎదిగేందుకు సహకారం అందనుంది.
News February 20, 2026
పొట్ట చుట్టూ కొవ్వు.. క్యాన్సర్‌కి సంకేతమా?

ఊబకాయం సమస్యను ఈజీగా తీసుకుంటే క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ఊబకాయం శరీరంలో దీర్ఘకాలిక ఇన్‌ఫ్లమేషన్, హార్మోన్ల అసమతుల్యత, ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు దారితీస్తూ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. బ్రెస్ట్, కోలన్, లివర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్‌లకు అధిక కొవ్వు ప్రధాన కారణం. హెల్తీ ఫుడ్, వ్యాయామం, బరువు నియంత్రణతో దీని నుంచి బయటపడొచ్చు’ అని వారు సూచిస్తున్నారు.
News February 20, 2026
గ్రీక్ యోగర్ట్‌తో ఎన్నో ప్రయోజనాలు

గ్రీక్ యోగర్ట్‌ను చాలామంది పెరుగుకు ప్రత్యామ్నాయంగా వాడతారు. ఇందులో నీరు, లాక్టోస్ లేకుండా ఎక్కువ ప్రొటీన్లు, తక్కువ షుగర్ ఉంటాయి. దీంట్లోని ప్రోబయోటిక్స్ వల్ల గట్ హెల్త్, ఎముకల ఆరోగ్యం బావుంటుంది. ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. అలాగే ఇది బరువు తగ్గడంలో కూడా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయం పూట యోగర్ట్ తీసుకుంటే.. టైప్ 2 డయాబెటిస్, గుండె సమస్యలు, క్యాన్సర్ ముప్పు తగ్గుతుందని చెబుతున్నారు.


