News September 12, 2025
గ్లోబల్ వెడ్డింగ్ డెస్టినేషన్ ప్రాంతంగా తిరుపతి: కలెక్టర్

టూరిజంపై పెట్టుబడిదారుల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని కలెక్టర్ డా.వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం తిరుపతిలో జరిగిన ప్రాంతీయ పర్యాటక పెట్టుబడుదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి, తిరుమలలో పెళ్లి చేసుకోడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతారని, తిరుపతిని గ్లోబల్ వెడ్డింగ్ డెస్టినేషన్ ప్రాంతంగా అభివృద్ధి చేసేలా టూరిజం,TTD చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
Similar News
News September 12, 2025
విద్యార్థులకు గుణాత్మక విద్య అందించాలి: కలెక్టర్

ప్రభుత్వ కళాశాలల్లోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు కనీసం 70 శాతం మార్కులు వచ్చేలా ఉపాధ్యాయులు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాళ్లతో సమావేశమయ్యారు. విద్యార్థులకు సరైన బోధన అందించడంపై ప్రధానంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
News September 12, 2025
నదీ ప్రవాహక ప్రాంతాల్లో ఇసుక తవ్వుకాలు నిషేధం: కలెక్టర్

జిల్లాలో ఎక్కడైనా నదీ ప్రవాహక ప్రాంతాలలో ఇసుక తవ్వకాలు నిషేధమని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లో ఆయన ఎస్పీ మణికంఠ చందోలు, జేసీలతో కలిసి జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఆదాయం కోసం కాకుండా ప్రజలకు సులభంగా ఇసుక అందుబాటులో ఉంచడం ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. జిల్లాలో 45,850 మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉందన్నట్లు ఆయన వివరించారు.
News September 12, 2025
ట్రంప్ సన్నిహితుడి హత్య.. ఎందుకు చంపాడంటే?

ట్రంప్ సన్నిహితుడు ఛార్లీ కిర్క్‌ను గన్‌తో కాల్చి చంపిన కేసులో నిందితుడు టేలర్ రాబిన్‌సన్(22)ను US పోలీసులు అరెస్ట్ చేశారు. అధికారులు విడుదల చేసిన ఫొటోల్లో ఉన్నది టేలరేనని అతడి తండ్రి గుర్తించి లొంగిపోమని చెప్పాడు. ఓ పాస్టర్‌ను సాయం కోరగా ఆయన పోలీసులకు సమాచారమిచ్చారు. ‘కిర్క్ పొలిటికల్, విద్వేష ప్రసంగాలు చేస్తున్నాడు’ అని హత్యకు ముందు రోజు రాత్రి టేలర్ ఇంట్లో చెప్పినట్లు అతడి తండ్రి తెలిపారు.