News November 26, 2025
గ్లోబల్ సమ్మిట్: పెట్టుబడిదారుల దృష్టికి సౌకర్యాల జాబితా

డిసెంబర్ 8, 9 తేదీల్లో పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలనూ చేస్తోంది. ముఖ్యంగా ఇక్కడ సర్కారు కల్పించనున్న సౌకర్యాలను వారికి కూలంకుషంగా వివరించనుంది. ORR, RRR, IRR, గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి, బందర్ పోర్టు వరకు మార్గం, కొత్తగా నిర్మించే రైలు మార్గాలు తదితరాలను వారికి అర్థమయ్యేలా ప్రొజెక్ట్ చేయనుంది. ఎప్పుడూ.. ఎక్కడా.. ఎలాంటి సమస్యలు రానివ్వబోమని కచ్చితమైన హామీ ఇవ్వనుంది.
Similar News
News November 26, 2025
‘పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి’

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్నారు. ఈరోజు జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కరీంనగర్ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలం పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలకు 2వ సాధారణ ఎన్నికలను 3 విడతలలో నిర్వహిస్తామని, డిసెంబర్ 11న 1 విడత, డిసెంబర్ 14న 2వ విడత, డిసెంబర్ 17న 3వ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనున్నట్లు తెలిపారు.
News November 26, 2025
RRR కేసు.. ఐపీఎస్ పీవీ సునీల్‌కుమార్‌కు సిట్ నోటీసులు

ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కస్టడీలో ‘థర్డ్ డిగ్రీ’ ప్రయోగించారన్న కేసులో మాజీ సీఐడీ చీఫ్, ఐపీఎస్ అధికారి పీవీ సునీల్‌కుమార్‌కు గుంటూరు సిట్ బుధవారం నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 4న విచారణకు హాజరుకావాలని అందులో స్పష్టం చేసింది. 2021లో రాజద్రోహం కేసు విచారణ సమయంలో తనను కస్టడీలో హింసించి, హత్యకు కుట్ర పన్నారన్న రఘురామ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
News November 26, 2025
విశాఖలో ఆత్మహత్య చేసుకున్న అల్లూరి విద్యార్థిని

అల్లూరి జిల్లా విద్యార్థిని విశాఖపట్నంలో బుధవారం ఆత్మహత్య చేసుకుంది. హుకుంపేట మండలం రాప గ్రామానికి చెందిన శోభ నందిని (19) కృష్ణా కాలేజీలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. మద్దిలపాలెంలో అద్దెకు ఉంటున్న ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు పోలీసులు నందని కుటుంబ సభ్యులుకు సమాచారం తెలియజేశారు. మృతురాలి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు.


