News March 26, 2024
ఘంటసాల మేనల్లుడు మృతి

గాన గంధర్వుడు ఘంటసాల మేనల్లుడు బుద్దు వెంకటసుబ్బయ్య శర్మ(75) మంగళవారం మోపిదేవిలో అనారోగ్యంతో మరణించారు. ఈయన వృత్తి రీత్యా తెలుగు ఉపాధ్యాయుడు. నెమలి, ఏటిమొగ, నాగాయలంక, తలగడదీవి, బావదేవరపల్లి ఉన్నత పాఠశాలలో పని చేశారు. దాదాపు 30 ఏళ్లు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. వంశపారపర్యంగా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో అర్చకుడిగా ఈయన పని చేశారు.
Similar News
News February 8, 2026
రేపు మచిలీపట్నంలో మీకోసం కార్యక్రమం

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు కలెక్టర్ డి.కె. బాలాజీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని ఆయన సూచించారు.
News February 8, 2026
కృష్ణా జిల్లాలో నాన్‌వెజ్ ధరలు ఎంతంటే..?

కృష్ణా జిల్లాలో ఆదివారం నాన్‌వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ కేజీ రూ. 280, స్కిన్ రూ. 270గా విక్రయిస్తున్నారు. డిమాండ్‌ను బట్టి కొన్ని ప్రాంతాల్లో స్వల్ప మార్పులు ఉన్నట్లు సమాచారం. మటన్ కేజీ రూ.1,000గా ఉంది. చేపల్లో బొచ్చ కేజీ రూ. 220లు, 30 కోడిగుడ్లు గతవారం రూ. 165లు ఉండగా నేడు రూ. 153కు చేరుకుంది. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News February 7, 2026
మచిలీపట్నంలో 38 మంది అధికారులపై చర్యలు

మచిలీపట్నం నగర పాలక సంస్థలో పని చేస్తున్న 38 మందిపై శాఖాపరమైన చర్యలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ACB అధికారులు చేపట్టిన తనిఖీల్లో బిల్లులు ఇవ్వకుండా కొత్త నీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వడం, ఇంటి పన్నుల విధింపులో అవకతవకలు చేశారని గుర్తించారు. దీనికి బాధ్యులైన 38 మందిపై శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించారు. వీరిలో అప్పటి మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ ఉన్నారు.


