News December 14, 2025
ఘట్‌కేసర్‌లో దక్షిణాసియాలోనే ఎత్తైన భవనం!

HYDకు వెళ్లగానే అద్దాల మేడలు చూపరులను కట్టిపడేస్తాయి. ఒక్కసారైనా వాటిలోకి అడుగుపెట్టాలనే ఆశ కలిగించేలా మంత్రముగ్ధులను చేస్తాయి. ఇప్పుడు ఆ అద్భుతాలన్నింటినీ మించిపోయేలా, నగర శివారు ఘట్‌కేసర్‌లో దక్షిణాసియాలోనే ఎత్తైన బంగ్లాను నిర్మించేందుకు రంగం సిద్ధమవుతోంది. 72 అంతస్తుల భవన నిర్మాణానికి అగ్నిమాపక శాఖ అనుమతులు కోరినట్లు సమాచారం. దూరం నుంచి గాలిలో మెలికలు తిరుగుతున్నట్లుగా కనిపించడం దీని స్పెషల్.
Similar News
News December 15, 2025
నల్గొండ: 1970లో సర్పంచ్ ఎన్నికకు రూ.25 ఖర్చు!

1970లో సర్పంచ్ ఎన్నికకు కేవలం రూ.25 మాత్రమే ఖర్చు చేశానని ఉమ్మడి NLG జిల్లా గట్టుప్పల్ మాజీ సర్పంచ్ పోరెడ్డి ముత్తారెడ్డి తెలిపారు. నాడు గ్రామంలో 9 వార్డులు ఉండేవని గుర్తు చేశారు. పరోక్ష పద్ధతిలో సర్పంచ్ ఎన్నికలో 5 వార్డుసభ్యుల మద్దతుతో సర్పంచ్‌గా ఎన్నికయ్యానని, టీ,టిఫిన్స్ ఖర్చులకే రూ.25 వెచ్చించానని,ఓటర్లకు రూపాయి కూడా ఇవ్వలేదన్నారు.నాడు ఓటింగ్ నిజాయతీగా జరిగేదని నేడు రూ.లక్షలు అవుతున్నాయన్నారు.
News December 15, 2025
కడప కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సోమవారం కడప కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి సభా భవన్లో జరిగే కార్యక్రమానికి జిల్లా ఉన్నతాధికారులు హాజరవుతారన్నారు. అర్జీదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవచ్చునన్నారు. కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా జరుగుతుందన్నారు.