News September 9, 2025

ఘట్‌కేసర్‌‌లో దారుణం.. ప్రశ్నించినందుకు చంపాడు

image

ఘట్‌కేసర్‌‌లో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఎస్సై శేఖర్ తెలిపిన వివరాలు.. బోయిగూడకు చెందిన భాస్కర్‌(27) పనికోసం వచ్చి స్థానిక అంబేడ్కర్ నగర్‌లో అద్దెకు ఉంటున్నాడు. అక్కడే ఉండే మణిదీప్ ఆదివారం రాత్రి భాస్కర్‌తో గొడవ పడ్డాడు. అనవసరంగా ఎందుకు గొడవ పడుతున్నావని ప్రశ్నించాడు. దీంతో మణిదీప్ ఇంట్లోంచి కత్తి తెచ్చి దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డ భాస్కర్.. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి చనిపోయాడు.

Similar News

News September 9, 2025

HYD: వాటర్ వృథా చేస్తే కాల్ చేయండి!

image

గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జలమండలి విజిలెన్స్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. జూబ్లీహిల్స్, మంగళ్‌హాట్‌లో ఇప్పటికే తనిఖీలు పూర్తయ్యాయి. తాగునీటిని బైకులు, కార్లు కడగడం, ఫ్లోర్ క్లీనింగ్, ఇతర అవసరాలకు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని, జరిమానాలు విధిస్తామని అధికారులు హెచ్చరించారు. మంచినీటిని ఎవరైనా వృథా చేస్తే, 155313 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

News September 9, 2025

HYD: స్పెషల్ డ్రైవ్ సత్ఫలితాలిస్తోంది

image

పోకిరీల ఆట కట్టించేందుకు వెస్ట్ జోన్‌లోని షేక్‌పేట్, ఖైరతాబాద్ పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ సత్ఫలితాలిస్తోంది. రాత్రివేళల్లో అతివేగంతో వాహనాలు నడిపేవారిపై కఠినచర్యలు తీసుకుంటున్నారు. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు వెయ్యికిపైగా కేసులు నమోదు చేశారు. వాహనాన్ని సీజ్ చేసి, చలాన్ కట్టిన తర్వాతే తిరిగి అప్పగిస్తున్నారు. ఈ డ్రైవ్‌ను 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో 5 నెలలుగా నిర్వహిస్తున్నారు.

News September 9, 2025

జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక.. ఈనెల 17 వరకు అవకాశం

image

జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ కమిషనర్ ఆర్వీ కర్ణన్ యువతకు కీలక సూచనలు చేశారు. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఈనెల 17 వరకు అవకాశం ఉందని కర్ణన్ తెలిపారు. ఈ సంవత్సరం జులై 1కి 18 సంవత్సరాలు పూర్తి అయిన యువత కచ్చితంగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఇందుకు రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కోరారు.