News January 25, 2025
ఘట్‌కేసర్: ఆ ఒక్క నిర్ణయంతో.. రూ.52 వేలకు ఉద్యోగుల సంఖ్య..!

అన్నోజిగూడ సమీపాన సింగపూర్ టౌన్‌షిప్ వద్ద ఉన్న ఇన్ఫోసిస్ కంపెనీ విస్తరిస్తామని ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒక్క నిర్ణయంతో నిరుద్యోగులకు 17 వేల ఐటీ ఉద్యోగాలు లభించనుండగా, ప్రస్తుతం ఇన్ఫోసిస్ సంస్థలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 35 వేల నుంచి కాస్త 52 వేలకు చేరనుంది. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్లానింగ్ ప్రారంభించారు.
Similar News
News December 12, 2025
‘అఖండ-2’ మూవీ రివ్యూ&రేటింగ్

దైవంపై పడిన నింద తొలగించడం, హిందూ ధర్మ పరిరక్షణకు అఖండ ఏం చేశారనేది స్టోరీ. బాలకృష్ణ నట విశ్వరూపం చూపించారు. ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ హైలైట్. తమన్ BGM&యాక్షన్ సీన్లు ఆకట్టుకుంటాయి. దేశభక్తి, సనాతన ధర్మంపై డైలాగులు మెప్పిస్తాయి. దేశంతో దైవానికి లింక్ చేసి హైందవ ధర్మాన్ని చెప్పేలా బోయపాటి కథ అల్లారు. కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. ఫస్టాఫ్ ట్రిమ్ చేయాల్సింది. విలనిజం పండలేదు.
రేటింగ్: 2.75/5.
News December 12, 2025
వారణాసిలో 5 గెటప్‌లలో మహేశ్ బాబు!

రాజమౌళి-మహేశ్ కాంబోలో రూపొందుతున్న ‘వారణాసి’ నుంచి ఓ క్రేజీ అప్డేట్ వైరలవుతోంది. మహేశ్ 5 పాత్రల్లో కన్పిస్తారని సినీ వర్గాలు చెబుతున్నాయి. విజువల్ వండర్‌గా, సరికొత్త యాక్షన్ ప్యాక్డ్ అవతారాలలో హీరోను తెరపై చూపించనున్నారని టాక్ నడుస్తోంది. ‘రుద్ర’, రాముడిగా కనిపిస్తారని ఇప్పటికే రాజమౌళి 2 గెటప్‌లను రివీల్ చేయగా, మిగతా 3 ఏమై ఉంటాయని చర్చ జరుగుతోంది. ఈ ప్రచారం నిజమైతే మహేశ్ ఫ్యాన్స్‌కు పండగే.
News December 12, 2025
VZM: జిల్లాలో ఎరువుల కొరత లేదు.. వ్యవసాయాధికారి

రబీ పంటల అవసరాలకు జిల్లాలో యూరియా నిల్వలు పూర్తిగా అందుబాటులో ఉన్నాయని వ్యవసాయాధికారి రామారావు గురువారం తెలిపారు. ఇప్పటివరకు 8,058 మెట్రిక్ టన్నులు అందగా.. 5,110 టన్నులు రైతులకు విక్రయించారన్నారు. నెలాఖరుకి మరో 2,600 టన్నులు చేరనున్నాయని, ప్రస్తుతం 3,058 టన్నులు RSK, గోదాముల్లో ఉన్నాయన్నారు. ఎరువుల కొరత ఏదీ లేదని, ఎంఆర్పీకి మించి అమ్మితే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


