News July 10, 2025
ఘట్‌కేసర్: కన్న తండ్రినే హతమార్చింది

ప్రియుడు, తల్లితో కలిసి కన్న తండ్రినే హతమార్చిన ఘటన ఘట్‌కేసర్ PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. ముషీరాబాద్- ముగ్గుబస్తీకి చెందిన వడ్లూరి లింగం(45), శారద దంపతుల పెద్ద కుమార్తె భర్తతో విడిపోయి వీరి వద్దే ఉంటుంది. మనీషా వివాహేతర సంబంధంపై తండ్రి హెచ్చరించాడు. దీంతో కక్ష పెంచుకున్న మనీషా.. ఈనెల 5న ప్రియుడు మహ్మద్ జావీద్, తల్లితో కలిసి తండ్రిని చంపేసి శవాన్ని ఏదులాబాద్ చెరువులో పడేశారు.
Similar News
News July 10, 2025
భర్తతో విడాకులంటూ ప్రచారం.. స్పందించిన నయనతార

భర్తతో విడాకులు తీసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలపై హీరోయిన్ నయనతార స్పందించారు. ‘మా గురించి సిల్లీ న్యూస్ వచ్చినప్పుడు మా రియాక్షన్ ఇదే’ అని భర్త విఘ్నేశ్‌తో తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాలో స్టోరీగా పెట్టారు. వీరికి 2022లో పెళ్లి కాగా ఇద్దరు కుమారులు(ట్విన్స్) ఉన్నారు. విఘ్నేశ్ తమిళ ఇండస్ట్రీలో దర్శకుడిగా, లిరిసిస్ట్‌గా ఉన్నారు. ప్రస్తుతం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ మూవీని తెరకెక్కిస్తున్నారు.
News July 10, 2025
విశాఖ: రైలు ఢీకొని వ్యక్తి మృతి

రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన కంచరపాలెం సమీపంలోని NCC రైల్వే యార్డ్ వద్ద జరిగింది. స్థానికుల సమాచారంతో GRP ఎస్‌ఐ అబ్దుల్ మారూఫ్ ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. మృతుడి వయసు సమారు 35 ఏళ్లు ఉంటాయన్నారు. అతని ఐడెంటిటికీ సంబంధించి ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని, మృతదేహాన్ని KGHకి తరలించామన్నారు. పై ఫొటోలో ఉన్న వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే తమను సంప్రదించాలని పేర్కొన్నారు.
News July 10, 2025
కబడ్డీ ఆడిన కర్నూలు DEO శామ్యూల్ పాల్

వెల్దుర్తిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమంలో తల్లిదండ్రులకు ఆటల పోటీలను ఉపాధ్యాయులు నిర్వహించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య స్నేహభావాన్ని పెంపొందించే విధంగా జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ విద్యార్థుల తండ్రులతో కలిసి కబడ్డీ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఆయన సూచించారు.