News September 7, 2025
ఘట్‌కేసర్: జులూస్‌లో గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

ఘట్‌కేసర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ డేవిడ్ గుండెపోటుతో మృతిచెందాడు. నిన్న విధులు ముగించుకొని మల్కాజిగిరి ఆనంద్‌బాగ్ విష్ణుపురి కాలనీలోని ఇంటికి వెళ్లాడు. సాయంత్రం కాలనీ వినాయకుడి ఊరేగింపులో డాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. స్థానికులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. ఉదయం 4 గంటలకు అతడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
Similar News
News September 8, 2025
నర్సంపేట: కలిసి కట్టుగా సరస్వతి నిలయాన్ని నిలబెట్టారు!

నర్సంపేట మండలంలో మారుమూల గ్రామమైన భోజ్యా నాయక్ తండాలో 15 ఏళ్ల కిందట సర్కారు బడి మూతపడింది. పక్క గ్రామాలకు వెళ్లలేక పలువురు విద్యార్థులు చదువుపై ఆసక్తి చూపట్లేదని ఈ తండాకు చెందిన ఉద్యోగులు, యువకులు, రాజకీయ నాయకులు బడిని తెరిపించేందుకు ముందుకు వచ్చారు. తలా కొంత వేసుకొని రూ.లక్షలు వెచ్చించి ఈ ఏడాది తండాలో బడిని పున: ప్రారంభించారు. అక్షరాస్యత దినోత్సవం రోజున తండా వాసులను అభినందించక తప్పదు మరి..!
News September 8, 2025
పెద్దపల్లి: NSEP 10న స్థానిక సంస్థల ఓటర్ జాబితా విడుదల

PDPL స్థానిక సంస్థల తుది ఓటర్ జాబితాను సెప్టెంబర్ 10న విడుదల చేయనున్నట్లు కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 137 ఎంపీటీసీ, 13 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నట్లు పేర్కొన్నారు. 650 ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డ్రాఫ్ట్ ఓటర్ జాబితాపై అభ్యంతరాలు సెప్టెంబర్ 8 సాయంత్రంలోపు సమర్పించాలన్నారు.
News September 8, 2025
రంప: ‘DRPలు తప్పనిసరిగా హాజరు కావాలి’

రంపచోడవరం, చింతూరు డివిజన్‌లో 11మండలాలకు చెందిన డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ రేపటి నుంచి ప్రారంభమయ్యే శిక్షణ తప్పనిసరిగా హాజరు కావాలని ఏజెన్సీ DEO. మల్లేశ్వరావు సోమవారం మీడియాకు తెలిపారు. రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ నెల 9,10 తేదీల్లో వీరందరికి శిక్షణ ఉంటుందన్నారు. 11మండలాల్లో 44 మంది DRPలకు స్టేట్ రిసోర్స్ పర్సన్స్ టీచింగ్ ఎట్ రైట్ లెవెల్ అనే అంశంపై శిక్షణ ఇస్తారని తెలిపారు.