News October 14, 2024
ఘనంగా పైడితల్లి తొలేళ్ల సంబరం

శ్రీ పైడితల్లి అమ్మవారి తొలేళ్ల సంబరం సోమవారం ఘనంగా జరిగింది. ఊరంతా పండగ శోభను సంతరించుకుంది. పులివేషాలు, కర్రసాము, కత్తిసాము, వివిధ వేషాలతో పట్టణంలో సందడి నెలకొంది. అమ్మవారికి మొక్కులు సమర్పించేందుకు భక్తులు బారులు తీరారు. ఘటాలతో, అమ్మవారి నామ స్మరణతో పట్టణం మారుమోగింది. వివిధ ప్రాంతాల నుంచి పట్టణానికి భక్తులు తరలివస్తున్నారు.
Similar News
News July 5, 2025
విశాఖలో బాలికపై అత్యాచారయత్నం

రణస్థలం ప్రాంతానికి చెందిన పిన్నింటి చంద్రశేఖర్ (26) డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ రేసపువానిపాలెం వినాయకనగర్ వద్ద నివాసం ఉంటున్నాడు. తన ఇంటి కింద నివసిస్తున్న ఏడో తరగతి చదువుతున్న బాలికను గదికి రప్పించి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్‌కి తరలించారు.
News July 5, 2025
విజయనగరం జిల్లాలో నేడు జాతీయ లోక్ అదాలత్

విజయనగరం జిల్లా కోర్టులో శనివారం జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు, ప్రజలు సద్వినియోగపరచుకోవాలని జిల్లా జడ్జ్ బబిత సూచించారు. ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా 20 లోక్ అదాలత్ బెంచీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాజీ పడదగిన క్రిమినల్, చెక్కు బౌన్స్ కేసులు ఇరు వర్గాల అనుమతితో రాజీ మార్గంలో శాశ్వత పరిస్కారం చేసుకోవచ్చన్నారు.
News July 4, 2025
ఒక్క మెరకముడిదాంలోనే 1100 మంది తగ్గిపోయారు: జడ్పీ ఛైర్మన్

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో గత ఏడాది కంటే ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య తగ్గడం ఆందోళన కలిగించే విషయమని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. జడ్పీ సర్వ సభ్య సమావేశంలో ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఒక్క మెరకముడిదాం మండలంలోనే 1100 మంది విద్యార్థులు తగ్గిపోయారని, జిల్లాలో చూస్తే ఆ సంఖ్య ఎక్కువగానే ఉంటుందన్నారు. పాఠశాలల అభివృద్ధికి నిధులు ఎప్పుడు కేటాయిస్తారని ప్రశ్నించారు.