News March 30, 2025
ఘిబ్లి ట్రెండ్‌లో చేరిన సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు కూడా ఘిబ్లి ట్రెండ్‌లో చేరారు. ఈ మేరకు ‘X’లో ఆయన పలు చిత్రాలను పోస్ట్ చేశారు. సీఎం పెట్టిన చేసిన ఫొటోలలో పీఎం నరేంద్ర మోదీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో కలిసి విజయోత్సవ సమావేశంలో తీసిన ఫొటో ఉంది. అలాగే నారా లోకేశ్, బ్రాహ్మణి, భువనేశ్వరి, దేవాన్ష్‌తో కలిసి ఉన్న ఫొటో, విజయవాడలో వరద బాధితులను ఓదార్చుతున్న ఫొటోలను సీఎం పోస్ట్ చేశారు.
Similar News
News December 30, 2025
GNT: ఉల్లాస్ అక్షర ఆంధ్రపై వీసీ నిర్వహించిన కలెక్టర్

జిల్లాలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు నిర్వహిస్తున్న ఉల్లాస్ అక్షర ఆంధ్ర కార్యక్రమంను నిర్దేశిత లక్ష్యాలకు మేరకు సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆమె ఉల్లాస్ అక్షర ఆంధ్రపై వీసీ చేపట్టారు. మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, సీఎంఎంలు, ఎంపీడీవోలు, ఏపీఎంలు, ఏపీఓలు పాల్గొన్నారు.
News December 30, 2025
గుంటూరు జిల్లాను ఆదర్శంగా నిలపాలి: కలెక్టర్

గృహ నిర్మాణ లక్ష్యాలు మార్చి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. గృహ నిర్మాణంపై అధికారులతో మంగళవారం కలెక్టరేట్‌లో ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఆప్షన్ 3 గృహాలలో స్టేజ్ డివియేషన్ ఉన్నవాటిని గుర్తించి వాటిని సరిచేసి పనులు వేగవంతం చేయాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన 5 లక్షల గృహాల నిర్మాణంలో గుంటూరు జిల్లాలో ఎక్కువ సంఖ్యలో గృహాలు పూర్తిచేసి ఆదర్శంగా నిలవాలన్నారు.
News December 30, 2025
రాజధాని ముఖద్వారంలో ‘న్యూ ఇయర్’ జోష్

రాజధాని ముఖద్వారంగా విరాజిల్లుతున్న మంగళగిరి న్యూ ఇయర్ వేడుకలకు ముస్తాబవుతోంది. మంగళగిరి హాయిలాండ్, తాడేపల్లిలోని విజయవాడ క్లబ్‌లో ఈవెంట్ ఆర్గనైజర్లు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రముఖ గాయనీగాయకులతో లైవ్ షోలు, మ్యూజికల్ నైట్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ వేడుకల టికెట్లు ‘బుక్ మై షో’లో అందుబాటులో ఉండగా, వీటి ధర రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు ఉన్నాయి.


