News November 8, 2025
ఘోర ప్రమాదం.. కారు ఎలా ధ్వంసమైందో చూడండి!

UPలోని షమ్లీలో జరిగిన రోడ్డు ప్రమాద దృశ్యాలు వైరల్‌గా మారాయి. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును స్విఫ్ట్ కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని నలుగురు కజిన్ బ్రదర్స్ చనిపోగా, ఒకరికి రేపు పెళ్లి కావాల్సి ఉంది. ఘటన జరిగినప్పుడు కారులోని భాగాలు 100M దూరంలో పడ్డాయి. వాహనం నామ రూపాల్లేకుండా మారడంపై SMలో చర్చ జరుగుతోంది. కొన్నికార్లలో సేఫ్టీ అధ్వానంగా ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Similar News
News November 9, 2025
HEADLINES

* నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన PM మోదీ
* పెట్టుబడుల సాధనకు లోకేశ్ తీవ్ర కృషి: సీఎం చంద్రబాబు
* ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే తాట తీస్తాం: పవన్
* కోటి దీపోత్సవాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తాం: సీఎం రేవంత్
* రేవంత్ వ్యక్తిగత విమర్శలు చేసినా భయపడను: కిషన్ రెడ్డి
* వర్షం కారణంగా IND Vs AUS చివరి టీ20 రద్దు.. 2-1తో సిరీస్ భారత్ వశం
* స్థిరంగా బంగారం, వెండి ధరలు
News November 9, 2025
మాగంటి మృతిపై విచారణ జరపాలని తల్లి ఫిర్యాదు

TG: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతిపై అనుమానాలున్నాయని ఆయన తల్లి మహానంద కుమారి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతిపై విచారణ చేయాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతకుముందు మాగంటి మరణంపై సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ <<18218398>>కేటీఆర్‌ను<<>> ఆమె డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
News November 9, 2025
ఇవన్నీ క్యాన్సర్ కారకాలే!

నిత్యం మనం ఉపయోగించే 200 రకాల వస్తువులు క్యాన్సర్‌కు దారి తీస్తాయని వైద్యులు చెబుతున్నారు. పదేపదే మరిగించే నూనె, ఎండకు ఉండే ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, చైనీస్ ఫుడ్ సాస్‌లు, క్యాండీలు, కృత్రిమ స్నాక్స్, టీ బ్యాగులు, ప్లాస్టిక్ కోటింగ్ ఉన్న టీ కప్పులు వీటిలోకే వస్తాయంటున్నారు. ప్లాస్టిక్, ప్రాసెస్డ్ ఫుడ్, వాడిన నూనెను వాడకపోవడం వంటి వాటికి దూరంగా ఉంటే ఈ ముప్పును చాలావరకు తగ్గించుకోవచ్చంటున్నారు.


