News April 14, 2025
ఘోర ప్రమాదానికి కారణమైన వాహనం స్వాధీనం

సత్యసాయి జిల్లా పరిగి మండలంలోని ధనాపురం వద్ద ఘోర ప్రమాదానికి కారణమైన వాహనాన్ని SI నరేంద్ర బెంగళూరులో స్వాధీనం చేసుకున్నారు. నిన్న ఉదయం ఆటోను ఐచర్ వాహనం ఢీకొనగా ముగ్గురు మహిళలు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఐచర్ వాహన డ్రైవర్ పరారై బెంగళూరులో తలదాచుకున్నాడు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్‌ఐ తమ సిబ్బందితో వెళ్లి వాహనాన్ని సీజ్ చేసి పరిగి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఘటనపై కేసు నమోదు చేశారు.
Similar News
News September 15, 2025
గద్వాల్: నేస్తమా నీవు కుశలమా..!

గద్వాల్లోని ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు (2004-2005) ఆత్మీయ సమ్మేళనం నిన్న నిర్వహించుకున్నారు. 20 ఏళ్ల తర్వాత కలుసుకొని అప్పటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఒకరి గురించి ఒకరు అడిగి తెలుసుకున్నారు. అందరూ కలిసి సెల్ఫీ, గ్రూప్ ఫొటోలు తీసుకున్నారు. అప్పటి ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.
News September 15, 2025
కడప ఎంపీ.. హాజరులో చివరి స్థానం

2024-25వ సంవత్సరానికి సంబంధించి లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ ఎంపీల పనితీరు నివేదికను పార్లమెంట్ ప్రతినిధులు ఆదివారం విడుదల చేశారు. ఈ నివేదికలో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి హాజరులో 54.41 శాతంతో చివరి స్థానంలో ఉన్నారు. 80 ప్రశ్నలను సభలో అడిగగా.. 5 చర్చల్లో మాత్రమే ఆయన పాల్గొన్నారు.
News September 15, 2025
పవర్‌గ్రిడ్‌లో 866 అప్రంటిస్‌లు.. AP, TGలో ఎన్నంటే?

పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 866 అప్రంటిస్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రికల్, సివిల్, రాజ్‌భాష, ఎగ్జిక్యూటివ్ లా విభాగాల్లో APలో 34, TGలో 37 ఖాళీలు ఉన్నాయి. పోస్టులను బట్టి ITI, డిప్లొమా, డిగ్రీ, PG చేసి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. పోస్టును అనుసరించి స్టైపెండ్ రూ.13,000 నుంచి రూ.17,500 వరకు ఉంటుంది. అక్టోబర్ 6లోగా powergrid.in సైట్‌లో అప్లై చేసుకోవచ్చు.