News March 9, 2025
ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

బయ్యారం మం. మిర్యాలపెంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కారేపల్లి సూర్యతండాకు చెందిన కళ్యాణ్, విజయ్ బైక్‌పై స్నేహితుడి పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్నారు. మిర్యాలపెంట వద్ద బైక్ అదుపు తప్పి కళ్యాణ్‌కు రోడ్డుపక్కన ఉన్న చెట్టు దుంగ తాకడంతో మృతి చెందాడు. విజయ్ గాయంతో బయటపడ్డాడు. కళ్యాణ్‌కు 2 నెలల క్రితమే వివాహం నిశ్చయమవగా హోలీ తర్వాత పెళ్లి పెట్టుకుందామనుకున్నారు.
Similar News
News March 9, 2025
NGKL: ఆ మృతదేహం గురు ప్రీత్ సింగ్‌దే: బైద్య

SLBC టన్నెల్‌లో నుంచి వెలికితీసిన మృతదేహం రాబిన్స్ కంపెనీకి చెందిన గురుప్రీత్‌సింగ్‌దే అని సింగరేణి జనరల్ మేనేజర్ బైద్య తెలిపారు. కాంక్రీట్‌లో కూరుకుపోయిన మృతదేహం ఒక చేయి బయటకు రావటంతో ఆ ప్రాంతంలో తీవ్రంగా శ్రమించిన రెస్క్యూ సిబ్బంది మృతదేహాన్ని వెలికితీసినట్లు ఆయన వివరించారు.
News March 9, 2025
సూర్యాపేట: సీపీఐకి ఒక ఎమ్మెల్సీ స్థానం

కాంగ్రెస్ అధిష్ఠానం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది. అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, కెతావత్ శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను ప్రకటిస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. వీరి ఎంపిక పట్ల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కాగా ఒక ఎమ్మెల్సీ సీటును కాంగ్రెస్ సీపీఐకి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఎమ్మెల్సీ పేరును సీపీఐ ప్రకటించాల్సి ఉంది.
News March 9, 2025
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే

AP: ఎమ్మెల్యే కోటా MLC అభ్యర్థుల పేర్లను టీడీపీ ఖరారు చేసింది. కావలి గ్రీష్మ (ఎస్సీ-మాల), బీద రవిచంద్ర (యాదవ), బీటీ నాయుడు (బోయ)కు ఎమ్మెల్సీ టికెట్లు కేటాయించింది. 5 స్థానాలకు గాను ఇప్పటికే ఒకటి జనసేనకు ఇవ్వగా, మరొకటి బీజేపీకి కేటాయించనుంది. ఉమ్మడి ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కూతురే కావలి గ్రీష్మ. ఆశావహులు చాలా మందే ఉన్నా ఊహించని నేతలకు టికెట్లు దక్కాయి.