News February 15, 2026

చండీగఢ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

చండీగఢ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్‌లో 12 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, సీఏ, ICWA అర్హతతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నెలకు రూ.60వేలు, మేనేజర్ పోస్టుకు రూ.70వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://chial.org/career/

Similar News

News February 20, 2026

నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్‌లో ఉద్యోగాలు

image

బెంగళూరులోని <>నేషనల్<<>> ఏరోస్పేస్ లాబోరేటరీస్ 5 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు ఫిబ్రవరి 25, 26 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి BE/BTech(ఎలక్ట్రానిక్స్ &కమ్యూనికేషన్, మెటలర్జికల్ ఇంజినీరింగ్, మెటీరియల్ సైన్స్&ఇంజినీరింగ్, EEE)అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. వెబ్‌సైట్: https://www.nal.res.in

News February 20, 2026

పురుగు మందులను కొంటున్నారా?

image

పంటల్లో చీడపీడల నివారణకు పురుగు మందులను కొనేటప్పుడు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోండి. ఒకే మందు పొడి మందుగాను, నీటిలో కరిగే ద్రావణంగాను, గుళికల రూపంలో లభ్యమౌతుంటే.. అవసరాన్ని బట్టి అంటే ఆశించిన పురుగు లేక తెగులును బట్టి, పంట దశ, నీటి లభ్యత, సమస్య తీవ్రతను అనుసరించి నిపుణుల సూచనతో మందును కొనాలి. షాపు యజమాని నుంచి రసీదును తప్పక తీసుకోవాలి. కొనేమందు పురుగుల మందు డబ్బా గడువు తేదీని చూసి తీసుకోవాలి.

News February 20, 2026

FLASH: తగ్గిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.320 తగ్గి రూ.1,56,170కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.300 పతనమై రూ.1,43,150 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2,70,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.