News December 29, 2025
చండీ ప్రదక్షిణ చేసేటప్పుడు పఠించాల్సిన మంత్రమిదే…

యానికాని చ పాపాని జన్మాంతరకృతానిచ|
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ |
త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సల ||
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావనే రక్ష రక్ష మహేశ్వర ||
Similar News
News January 7, 2026
సంక్రాంతి-2026 విన్నర్ ఎవరో?

సంక్రాంతి వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేస్తుంటాయి. ఈసారి కూడా పెద్ద, చిన్న హీరోలందరూ పొంగల్ బరిలో నిలిచారు. ప్రభాస్ ‘రాజాసాబ్’, మెగాస్టార్ చిరంజీవి ‘MSVG’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్ ‘అనగనగా ఒక రాజు’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రాలు రిలీజ్ కానున్నాయి. గతేడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ విన్నర్‌గా నిలిచింది. మీరు ఏ మూవీకి వెళ్తారు? COMMENT
News January 7, 2026
రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రారంభం

AP: రాజధాని అమరావతిలో రెండో విడత భూసమీకరణ ప్రారంభమైంది. మంత్రి నారాయణ గుంటూరు(D) వడ్డమానులో ల్యాండ్ పూలింగ్ 2.0ను స్టార్ట్ చేశారు. రైతుల నుంచి అంగీకార పత్రాలు స్వీకరించారు. అక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన సీఆర్డీఏ యూనిట్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. సాయంత్రం 4 గంటలకు ఎండ్రాయిలో గ్రామసభ నిర్వహించనున్నారు. కాగా ఈ విడతలో రైతుల నుంచి CRDA 16,666 ఎకరాలను సమీకరించనుంది.
News January 7, 2026
‘ప్రజల భద్రతే ముఖ్యం’.. వెనిజులా సంక్షోభంపై భారత్ ఆందోళన

వెనిజులా తాజా పరిస్థితులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రి జైశంకర్ లక్సెంబర్గ్‌లో మాట్లాడుతూ.. ‘వెనిజులా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అక్కడ శాంతి నెలకొనాలని, అన్ని పక్షాలు ప్రజల భద్రత, సంక్షేమానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నాం. వెనిజులాతో భారత్‌కు ఎప్పటి నుంచో మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుత సంక్షోభం నుంచి ఆ దేశ ప్రజలు సురక్షితంగా బయటపడాలన్నదే మా ఆకాంక్ష’ అని అన్నారు.


