News November 14, 2024
చండూరు అమ్మాయికి అమెరికా అందాల పోటీలో అవార్డు
చండూరుకి చెందిన ప్రవాస భారతీయురాలు బావండ్ల రిషితకు మిస్ ఫిలాంత్రఫీ యూనివర్స్ 2024-2025 అవార్డు లభించింది. ఈ నెల 11న అవార్డు అందుకున్నట్లు ఆమె తండ్రి మాణిక్యం తెలిపారు. బావంద్ల రామ లచ్చయ్య, సత్యమ్మ దంపతుల మూడో కుమారుడే బావండ్ల మాణిక్యం. 14 సంవత్సరాల క్రితం అమెరికాకి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.
Similar News
News December 3, 2024
బండి సంజయ్‌ను కలిసిన తీన్మార్ మల్లన్న..
దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ని తీన్మార్ మల్లన్న కలిసి విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా కులగణన పూర్తయితే బడుగు బలహీన వర్గాల జీవితాలు బాగుపడతాయని అన్నారు. ఎవరెంతో వాళ్లకు అంత వాటా అన్ని రంగాలలో దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బండిని కలిసిన వారిలో పిల్లి రామరాజు, వట్టే జనయ్య, తమ్మడ బోయిన అర్జున్ తదితరులు ఉన్నారు.
News December 3, 2024
నర్సింగ్ విద్యార్థిని సూసైడ్ అటెంప్ట్
సూర్యాపేట కలెక్టరేట్‌లో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం జరిగింది. కోదాడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నానని.. కాలేజీ యజమాన్యం వేధింపుల వల్లే ఆత్మహత్యాయత్నం చేసినట్లు స్టూడెంట్ చెప్పింది. కాగా ఆమె ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. విద్యార్థినిని కలెక్టర్ తేజస్ నందలాల్ పరామర్శించారు.
News December 3, 2024
NLG: ఉపసర్పంచ్ చెక్ పవర్ తొలగిస్తే పోటీ ఉంటుందా!
సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పంచాయతీరాజ్ యాక్ట్‌లో కొన్ని మార్పులు చేయనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి ఉప సర్పంచ్‌కు చెక్ పవర్ తొలగింపు. సర్పంచ్ అవ్వాలనుకున్నవారు పోటీ చేసే అవకాశం రాకపోతే కనీసం ఉప సర్పంచ్ అవ్వాలనుకుంటున్నారు. ప్రభుత్వం చెక్ పవర్ తొలగింపు నిర్ణయం తీసుకుంటే ఉమ్మడి NLG జిల్లాలో సర్పంచ్ పదవి కోరుకునే వారికి ఇంట్రస్ట్ ఉంటుందా.. మీరేమంటారు..