News February 13, 2025
చండ్రుగొండ : కేజీబీవీలో బాలికలపై ఎలుకల దాడి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739422876771_51808389-normal-WIFI.webp)
చండ్రుగొండలోని కేజీబీవీ బాలికల వసతి గృహంలో విద్యార్థులపై ఎలుకలు దాడి చేసి గాయపరిచాయి. ఎంఈవో సత్యనారాయణ వివరాల ప్రకారం.. పడుకొని ఉన్న ఇద్దరు బాలికలపై ఎలుకలు దాడి చేసి స్వల్పంగా గాయపరిచాయని చెప్పారు. వసతి గృహాన్ని సందర్శించి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Similar News
News February 13, 2025
MBNR: జన సంద్రంగా మన్యంకొండ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739437264817_51058019-normal-WIFI.webp)
మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం భక్త జనసంద్రమైంది. భక్తుల గోవింద నామ స్మరణంతో ఆలయ గిరులు మారుమోగాయి. గురువారం తెల్లవారుజాము వరకు జరిగిన రథోత్సవ వేడుకలలో స్థానిక MLA యెన్నం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, SP జానకి, జిల్లా గ్రంథాలయ సంస్థల ఛైర్మన్ మల్లు నరసింహారెడ్డి, హుడా ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
News February 13, 2025
‘తండేల్’ కలెక్షన్ల సునామీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739437836362_1226-normal-WIFI.webp)
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన తండేల్ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లలో దూసుకుపోతోంది. ఆరు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.86 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. వాస్తవ ఘటనల ఆధారంగా చందూ మొండేటి తెరకెక్కించిన ఈ సినిమాలో హీరో హీరోయిన్ల పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. కాగా ఇవాళ సాయంత్రం శ్రీకాకుళంలో మూవీ యూనిట్ థాంక్యూ మీట్ నిర్వహించనుంది.
News February 13, 2025
అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739439018283_1045-normal-WIFI.webp)
AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో కృష్ణా జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. కీలక ప్రాంతాల్లో భారీగా బలగాల్ని మోహరించారు. జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉందని జిల్లా ఎస్పీ గంగాధర్ రావు ప్రకటించారు. ర్యాలీలు, సభల వంటివాటిపై నిషేధం ఉంటుందని, ఎవరైనా అసాంఘిక చర్యలకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు.