News September 24, 2025
చందమామ కథలను ప్రారంభించింది మన తెనాలి వారే

తెలుగు రచయిత, ‘చందమామ’ పుస్తక సంపాదకుడు, చందమామ-విజయా కంబైన్స్ సహా నిర్మాత ఆలూరు వెంకట సుబ్బారావు (కలంపేరు చక్రపాణి) తెనాలిలో జన్మించారు. ఆయన రచయితగా, అనువాదకుడిగా పేరు పొందడంతో సినిమా అవకాశాలు వచ్చాయి. సినిమాలే కాక ఆయన నాగిరెడ్డితో కలసి 1947 జులైలో పిల్లల కోసం చందమామ కథల పుస్తకం ప్రారంభించారు. భారతీయుల్లో చదవడం వచ్చిన ప్రతి ఒక్కరూ చందమామ ఒక్కసారైనా చదివే ఉంటారనడంలో అతిశయోక్తి లేదు.
Similar News
News September 24, 2025
GNT: ఆ రోజుల్లోనే ఓ పాఠశాల పత్రిక నడిపారు

ఆంధ్ర కమ్యూనిస్ట్ ఉద్యమ నేతలలో ప్రముఖుడు, భారత కమ్యూనిస్టు పార్టీ- మార్క్సిస్టు (CPM) పాలిట్‌బ్యూరో సభ్యుడు కొరటాల సత్యనారాయణ (సెప్టెంబరు 24, 1923 – జులై 1, 2006) ఉమ్మడి గుంటూరు జిల్లా ప్యాపర్రులో జన్మించారు. క్విట్ ఇండియా ఉద్యమం, గుంటూరులో పోలీసుల కాల్పులు, విద్యార్థుల మరణం ఉద్యమ స్ఫూర్తిని పెంచాయి. 1942లో కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడయ్యారు. ఆ రోజుల్లోనే ఓ పాఠశాల పత్రిక కూడా నడిపారు
News September 24, 2025
24 నెలల్లో అమరావతిలో ప్రపంచ స్థాయి లైబ్రరీ..?

అమరావతి ప్రాంతంలో 24 నెలల్లో రూ.150 కోట్ల వ్యయంతో ప్రపంచ స్థాయి లైబ్రరీ నిర్మించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మంత్రి లోకేశ్ ఇందుకు సంబంధించిన వివరాలను అసెంబ్లీలో చెప్పారు. లైబ్రరీ అభివృద్ధికి శోభా డెవలపర్స్ రూ.100 కోట్లు హామీ ఇచ్చారని, మంగళగిరిలో ఏకంగా అక్టోబర్‌లో మోడల్ లైబ్రరీ ప్రారంభించనున్నట్లు సమాచారం. పోటీ పరీక్షల అభ్యర్థులకు డిజిటల్ & భౌతిక లైబ్రరీలలో అవసరమైన అన్ని పుస్తకాలు లభిస్తాయి.
News September 23, 2025
ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మంగళవారం రాత్రి వరకు బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో 3,97,250 క్యూసెక్కులుగా ఉంది. దీంతో కృష్ణ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అదే విధంగా కృష్ణ, గుంటూరు జిల్లాల్లో 53 మంది అధికారులకు వరద పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు.