News October 25, 2025
చందుర్తి: ఆర్థిక ఇబ్బందులతో అంగన్‌వాడీ టీచర్ ఆత్మహత్య

చందుర్తి మండలం సనుగుల దేవుని తండా అంగన్‌వాడీ కేంద్రం టీచర్ గొట్టె పరిమళ (39) శనివారం ఉదయం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత 23 ఏళ్లుగా అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేసి మంచి పేరు సంపాదించుకున్న పరిమళ.. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలికి భర్త నరేష్, ఇద్దరు కుమారులు ఉన్నారు.
Similar News
News October 25, 2025
ఇతర పదవుల్లో ఉండే వారికి DCC రాదు: PCC చీఫ్

TG: సమర్థులను DCC అధ్యక్షులుగా ఎంపిక చేస్తామని PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ‘జిల్లాల నుంచి భారీగా అప్లికేషన్లు వచ్చాయి. కనీసం 5ఏళ్లు పార్టీలో పనిచేసి ఉండాలన్న నిబంధన ఉంది. మ.3కు అధిష్ఠానం CM, Dy.CMతో పాటు నా అభిప్రాయం తీసుకొని లిస్టు ఫైనల్ చేస్తుంది. సామాజిక న్యాయం ప్రకారం ఎంపిక ఉంటుంది. ఇప్పటికే పదవుల్లో ఉన్నవారికి DCC ఇవ్వరాదనే నియమం ఉంది. అలాంటి వారికి ఈ పదవి రాదు’ అని స్పష్టం చేశారు.
News October 25, 2025
విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించాలి: అడ్లూరి

విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సిద్దిపేట కలెక్టర్ హైమావతి, ఇతర అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాలలో విద్యా, వసతి, శానిటేషన్, ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
News October 25, 2025
ఫ్లవర్‌వాజ్‌లో పూలు తాజాగా ఉండాలంటే..

ఫ్లవర్ వాజ్‌లో ప్లాస్టిక్ పువ్వులకు బదులు రియల్ పువ్వులను పెడితే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. కానీ ఇవి త్వరగా వాడిపోతుంటాయి. ఇలా కాకుండా ఉండాలంటే పువ్వులను ఫ్లవర్‌వాజ్‌లో పెట్టేటప్పుడు వాటి కాడలను కొంచెం కట్ చేయాలి. అలాగే ఈ నీటిని రెండు రోజులకు ఒకసారి మారుస్తుండాలి. ఇందులో కాపర్ కాయిన్/పంచదార/ వెనిగర్ వేస్తే పువ్వులు ఫ్రెష్‌గా ఉంటాయి. ఫ్లవర్‌వాజ్‌ను నేరుగా ఎండ తగిలే ప్లేస్‌లో ఉంచకూడదు.


