News March 7, 2025

చందోలు పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట

image

తమకు రక్షణ కల్పించాలని ఓ ప్రేమ జంట గురువారం చందోలు పోలీసులను ఆశ్రయించింది. పిట్టలవానిపాలెం మండలం పరిసవారిపాలెం గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి అనే యువకుడు అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తమకు కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 9, 2025

భట్టిప్రోలు: బంగారంతో ఛాంపియన్స్ ట్రోఫీ తయారీ

image

అంతర్జాతీయ క్రికెట్ వన్డే ఇంటర్నేషనల్ ఛాంపియన్ ట్రోఫీ‌కి, మండలంలోని ఐలవరం గ్రామానికి చెందిన స్వర్ణకారుడు మాచర్ల వీరేంద్ర 1.60 గ్రాముల బంగారంతో ట్రోఫీకి సంబంధించిన కప్పు, బ్యాట్, పిచ్, వికెట్లను తయారు చేశాడు. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో క్రికెట్ ప్రేమికులను కనువిందు చేసేందుకు ట్రోఫీని పెట్టనున్నట్లు వీరేంద్ర తెలిపారు. క్రికెట్ మీద ఇష్టంతో ఈ ట్రోఫీని తయారు చేసినట్లు వీరేంద్ర తెలిపారు.

News March 9, 2025

గ్రాడ్యుయేట్ MLC ఓటమిపై కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్

image

TG: KNR-ADB-NZB-MDK గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు ఓటమికి గల కారణాలపై వివరణ ఇవ్వాలని పీసీసీ చీఫ్‌ను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశించారు. ‘రాష్ట్రంలో అధికారంలో ఉండి, ఉద్యోగాల భర్తీ, యువత సంక్షేమానికి కృషి చేస్తున్నా ఓడిపోవడం సరికాదు. దీని వల్ల పార్టీపై, ప్రభుత్వంపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఓటమిపై సమగ్ర రిపోర్ట్ ఇవ్వండి’ అని ఆదేశించినట్లు సమాచారం.

News March 9, 2025

స్టీల్ ప్లాంట్‌లో 900 మంది కార్మికులు తొలగింపు

image

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో 900 మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తొలగించింది. ఇప్పటికే అఖిలపక్ష కార్మిక సంఘాలు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సమ్మె నోటీసులు ఇచ్చారు. అయితే మరో పక్కన స్టీల్ సీఐటీయూ గౌరవాధ్యక్షుడు అయోధ్యరామ్‌కు యాజమాన్యం షోకాజ్ నోటీసు ఇచ్చింది. ఉక్కు పరిరక్షణ ఉద్యమాన్ని అణగదొక్కేందుకు కార్మిక సంఘాల ప్రతినిధులపై ఉక్కు యాజమాన్యం కుట్రలు చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు.

error: Content is protected !!