News January 28, 2025
చంద్రగిరిలో రోడ్డు ప్రమాదం.. క్లీనర్ స్పాట్ డెడ్

చంద్రగిరి మండలం, మామండూరు జాతీయ రహదారిపై రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బైపాస్ రోడ్డులో పార్కింగ్ చేసి ఉన్న లారీని వెనుక నుంచి కోళ్లు లారీ ఢీకొట్టింది. దీంతో కోళ్లు లారీ క్లీనర్ వెంకటేశ్ క్యాబిన్‌లో చిక్కుకొని అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కాలేజ్‌కు తరలించి కేసు నమోదు చేశారు.
Similar News
News February 16, 2026
BIG BREAKING: నర్సాపూర్‌లో ఒక్కటైన కాంగ్రెస్, BJP

నర్సాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్, BJP ఒక్కటయ్యాయి. మొత్తం 15 వార్డులకు గాను కాంగ్రెస్ 6, BRS 5, BJP 4 వార్డులు గెలిచాయి. హంగ్ ఏర్పడగా ఈరోజు కాంగ్రెస్, BJP జతకట్టి పీఠం దక్కించుకున్నాయి. ఛైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ 5వ వార్డు కౌన్సిలర్ మాచునూరి లక్ష్మి ఎన్నికవగా, వైస్ ఛైర్మన్‌గా 13వ వార్డు కౌన్సిలర్ బుచ్చేశ్ యాదవ్‌ను ఎన్నుకున్నారు. దీంతో కాంగ్రెస్, BJP నేతలు కలిసి సంబరాలు జరిపారు.
News February 16, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ.15,720
* 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ.14,462
* వెండి 10 గ్రాముల ధర రూ.2,505.
News February 16, 2026
కాంగ్రెస్‌దే తొర్రూరు?

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మునిసిపాలిటీ కాంగ్రెస్ వశమైనట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్‌కు చెందిన ఓ అభ్యర్థి అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించడంతో తొర్రూరు మున్సిపాలిటీపై కాంగ్రెస్ పట్టు సాధించినట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తొర్రూర్ మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడింది.


