News November 15, 2025
చంద్రగిరి: బీటెక్ విద్యార్థి మృతి

చంద్రగిరి మండలం కోదండరామాపురం సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బంగారుపాళ్యానికి చెందిన లక్ష్మీకాంత్ చిత్తూరు సమీపంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. బైక్‌పై తిరుపతికి వచ్చే క్రమంలో లారీని ఢీకొన్నాడు. విద్యార్థి అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 15, 2025
సూర్యాపేట: కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన కారు

సూర్యాపేట(D) తిరుమలగిరి(M) నాగారంలో సూర్యాపేట-జనగామ హైవేపై పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా జనగామ నుంచి సూర్యాపేట వెళ్తున్న కారు అతివేగంగా పోలీసు కానిస్టేబుల్‌ను ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ కమలాకర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉంది. తరువాత అటుగా వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న ఇద్దరూ గాయపడ్డారు.
News November 15, 2025
1.20L గ్లైడ్ బాంబుల తయారీకి రష్యా ప్లాన్?

తమ దేశంపై దాడి కోసం రష్యా 1,20,000 గ్లైడ్ బాంబుల తయారీకి ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఉక్రెయిన్ సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు ఆరోపించారు. వీటిలో 200KMకు పైగా లక్ష్యాలను చేరుకునే 500 లాంగ్ రేంజ్ వెర్షన్ బాంబులు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. వీటి వల్ల ఉక్రెయిన్‌కు భారీ నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ఈ ఆరోపణలపై మాస్కో స్పందించలేదు. కాగా 2022 నుంచి ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోన్న విషయం తెలిసిందే.
News November 15, 2025
ASF: జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి వినతి

ఆసిఫాబాద్‌లో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ సీపీఐ మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డిని అభ్యర్థించారు. ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసం వినతి పత్రం అందజేశారు. సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని చాడ వెంకటరెడ్డి భరోసానిచ్చారు. నాయకులు తారు, అబ్దుల్ హన్నాన్, రాధాకృష్ణ చారి పాల్గొన్నారు.


