News September 7, 2025
చంద్రగ్రహణం.. ఆలయాల మూసివేత

నేడు చంద్రగ్రహణం సందర్భంగా నగరంలోని ప్రధాన ఆలయాలు మూతపడనున్నాయి. బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి, స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను మధ్యాహ్నం నుంచి రేపు ఉదయం వరకు మూసి ఉంచుతామని ఆలయ అధికారులు ప్రకటించారు. సంప్రోక్షణ కార్యక్రమం తర్వాత మరుసటి రోజు ఉదయం నుంచి భక్తులను అనుమతిస్తామని పండితులు తెలిపారు.
Similar News
News September 7, 2025
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్‌పై మాజీ మేయర్ కన్ను!

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీచేసే ఆశావహుల సంఖ్య కాంగ్రెస్ పార్టీలో పెరిగిపోతోంది. నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా పోటీచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. జూబ్లీహిల్స్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ తాను కూడా టికెట్ ఆశిస్తున్నారని నేరుగా చెబుతున్నారు. తనకు ఇక్కడ మంచి పరిచయాలు ఉన్నాయని, మేయర్‌గా పనిచేసిన అనుభవం కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు.
News September 7, 2025
బోయిన్‌పల్లి: లక్కీ డ్రా.. రూ.100కే ఎలక్ట్రిక్ బైక్

బోయిన్‌పల్లిలోని అంజయ్యనగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహించిన లక్కీ డ్రాలో బోయిన్‌పల్లి నరేశ్‌ను అదృష్టం వరించింది. కేవలం రూ.100 టికెట్‌తో ఆయన ఎలక్ట్రిక్ బైక్‌ను బహుమతిగా గెలుచుకున్నారు. తన అదృష్టాన్ని నమ్మలేకపోతున్నానని, చాలా సంతోషంగా ఉందని నరేశ్ అన్నారు. వినాయకచవితి స్వామి ఆశీస్సులు అందాయని పేర్కొన్నారు.
News September 7, 2025
విద్యార్థులకు ALERT.. రేపు CPGET రిజల్ట్స్

వివిధ యూనివర్సిటీల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం నిర్వహించిన సీపీగెట్ (CPGET) ఎంట్రెన్స్ టెస్ట్ ఫలితాలను అధికారులు సోమవారం విడుదల చేయనున్నారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో ఎంఎస్స్, ఎంకాం, ఎంఏ కోర్సుల్లో చేరేందుకు అభ్యర్థులు పరీక్షలు రాశారు. హయ్యర్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ బాలక్రిష్ణారెడ్డి తెలిపారు.