News September 7, 2025

చంద్రగ్రహణం.. ఒంటిమిట్ట ఆలయం మూసివేత

image

ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం ఆలయాన్ని మూసివేయనున్నారు. అలాగే కడప జిల్లాలోని పలు ఆలయాలు పొలతల మల్లేశ్వరస్వామి, పులివెందులలోని వెంకటేశ్వర స్వామి, మిట్ట మల్లేశ్వరస్వామి, రంగనాథస్వామి ఆలయం, గండి వీరాంజనేయస్వామి ఆలయం, నందలూరు సౌమ్యనాథస్వామి ఆలయం మూసివేయనున్నట్లు గండి EO వెంకటసుబ్బయ్య తెలిపారు.

Similar News

News September 7, 2025

3 నెలల్లో స్మార్ట్ కిచెన్‌ల నిర్మాణాలు పూర్తి: కలెక్టర్

image

కడప జిల్లాలోని 33 మండలాల్లో సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ల నిర్మాణాలను మూడు నెలల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని వివిధ మండలాల్లో స్మార్ట్ కిచెన్ నిర్మాణాల అంచనాలు, టెండర్లు, మెటీరియల్ సంబంధిత అంశాలపై వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్షించారు. 3 నెలల్లో పూర్తయ్యేలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించాలన్నారు.

News September 7, 2025

కడప జిల్లాను ప్రథమ స్థానంలోకి తేవాలి: కలెక్టర్

image

నీతి అయోగ్ నిర్దేశించిన అంశాల్లో జిల్లాను ప్రథమ స్థానంలోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆకాంక్ష జిల్లా, ఆకాంక్ష బ్లాకుల్లో ఆరు విభాగాల్లో లక్ష్యాలను సాధించిన నేపథ్యంలో సంబంధిత భాగస్వామ్య శాఖల అధికారులు, ఫ్రెంట్ లైన్ అధికారులు, సిబ్బందిని అభినందిస్తూ శనివారం కడపలోని ఓ కన్వెన్షన్ హాలులో “సంపూర్ణత అభియాన్ సత్కార కార్యక్రమం” జరిగింది.

News September 7, 2025

భూపేశ్ రెడ్డికి కడప జిల్లా పగ్గాలు?

image

జమ్మలమడుగు టీడీపీ ఇన్‌ఛార్జ్ భూపేశ్ రెడ్డికి కడప జిల్లా అధ్యక్ష బాధ్యతలను పార్టీ అధిష్ఠానం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డి(వాసు)కి అదనంగా పొలిట్ బ్యూరో పదవి ఉండటంతో భూపేశ్‌కు జిల్లా అధ్యక్ష పదవి ఇస్తారనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ రేసులో ప్రొద్దుటూరు టీడీపీ నేత ఉక్కు ప్రవీణ్ కూడా ఉన్నారు. మరి టీడీపీ అధిష్ఠానం ఎవరికి పగ్గాలు ఇస్తుందో చూడాలి.