News March 2, 2026

చంద్రగ్రహణం: రేపు ఆలయాల మూసివేత

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని శ్రీశైలం, మహానంది, యాగంటి, కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తదితర ఆలయాలను చంద్రగ్రహణం కారణంగా రేపు వేకువజాము నుంచి మూసివేస్తున్నట్లు ఈవోలు తెలిపారు. శ్రీశైలంలో రేపు రాత్రి 9కి భక్తులకు దర్శనం కల్పిస్తారు. మిగతా ఆలయాల్లో బుధవారం వేకువజామున సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాలు చేపడతారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Similar News

News March 2, 2026

నరసరావుపేట: పోలీస్ గ్రీవెన్స్‌కి 92 ఫిర్యాదులు

image

పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన PGRS కార్యక్రమంలో ఎస్పీ బి.కృష్ణారావు పాల్గొన్నారు.
ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి సమస్యలు తెలుసుకున్నారు. నిర్ణీత సమయంలోనే పరిష్కారం అందించేలాచర్యలుతీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆర్థిక, కుటుంబ, మోసాలు, బెదిరింపులు, ఆక్రమణలకు సంబంధించినవి 92 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత అధికారులుకు రిఫర్ చేశారు.

News March 2, 2026

అనకాపల్లి: కలెక్టర్‌ను కలిసిన మిట్టల్ స్టీల్ ప్లాంట్ ప్రతినిధులు

image

నక్కపల్లిలో అర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ సీఈవో దిలీప్ ఒమెన్, ప్రాజెక్ట్ చీఫ్ కేఎల్ చౌదరి, హెచ్ఆర్ డైరెక్టర్ అశుతోష్ సోమవారం కలెక్టర్ విజయ కృష్ణన్‌ను కలిశారు. నక్కపల్లి వద్ద స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను ఆమెతో చర్చించారు. భూ సమీకరణ, పునరావాస కాలనీల అభివృద్ధి, అప్రోచ్ రోడ్ల నిర్మాణం, నీటి సరఫరా కోసం పైప్ లైన్ల నిర్మాణం తదితర అంశాలపై కలెక్టర్ వారితో సమీక్షించారు.

News March 2, 2026

అర్జీల పట్ల నిర్లక్ష్యం తగదు: కలెక్టర్

image

అనకాపల్లి జిల్లా కలెక్టరెట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌కు-128, రెవెన్యూ క్లినిక్‌కు 173 అర్జీలు వచ్చాయని కలెక్టర్ విజయ్ కృష్ణన్ తెలిపారు. అర్జీదారుల సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం వహించరాదన్నారు.
భూసంబంధిత సమస్యలను రెవిన్యూ క్లినిక్ ద్వారా సత్వరమే పరిష్కరించాలన్నారు. అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రజలతో నేరుగా మాట్లాడాలని కలెక్టర్ సూచించారు.