News November 20, 2024
చంద్రబాబు అరెస్ట్‌కు కుట్ర: MLA కోటం రెడ్డి
CMపైనే కుట్రలు జరుగుతుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని అసెంబ్లీలో MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిలదీశారు. ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. చంద్రబాబు అరెస్ట్‌కు వైసీపీ హయాంలో పెద్ద కుట్రే జరిగిందని ఆరోపించారు. తక్షణమే దీనిపై స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. డిప్యూటీ స్పీకర్ RRR స్పందిస్తూ.. ఇది జీరో అవర్ అని.. ఇక్కడ సమాధానాలు ఉండవన్నారు. దీనిపై తరువాత చర్చిద్దాం అంటూ ఆయన తెలిపారు.
Similar News
News November 21, 2024
జగన్ నిర్వాకంతో రూ.5వేల కోట్ల ప్రజాధనం ఆవిరి: సోమిరెడ్డి
గత ప్రభుత్వం హయాంలో YS జగన్ తన హంగులు, ఆర్భాటాల కోసం ఏకంగా రూ.5 వేల కోట్ల ప్రజా ధనాన్ని వృథా చేశారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. పాసు పుస్తకాలపై బొమ్మలు, రుషికొండ ప్యాలెస్ నిర్మాణంతో ప్రజల సొమ్మును జగన్ మంచి నీళ్లలా ఖర్చు చేశారని మండిపడ్డారు. జగన్ నిర్వాకంతో ప్రజలకు బడ్జెట్ మీద ఆశలు పోయాయన్నారు. అందుకే YCPని ప్రజలు కేవలం 11 సీట్లకు పరిమితం చేశారని ఆయన స్పష్టం చేశారు.
News November 21, 2024
ముగ్గురు పంచాయతీ కార్యదర్శులు సస్పెండ్
నెల్లూరు జిల్లాలో ముగ్గురు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని రాపూరు పంచాయతీ ఇన్‌ఛార్జి కార్యదర్శి చెంచయ్యను లైంగిక వేధింపుల అభియోగాలతో, కృష్ణపట్నం పంచాయతీ కార్యదర్శులు మస్తానయ్య, రాజశేఖర్‌లను నిధులు దుర్వినియోగం అభియోగాలపై కలెక్టర్ ఈ మేరకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.