News June 10, 2024
చంద్రబాబు చూపు దామచర్ల వైపేనా ?

ఒంగోలు MLA దామచర్ల జనార్దన్‌కి మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు రాజకీయ వారసుడిగా వచ్చిన జనార్దన్ TDP కష్టకాలంలో దశాబ్దం పాటు జిల్లా అధ్యకుడిగా పార్టీకి సేవలందించారు. అలాగే ఒంగోలులో మహానాడు, యువగళం కార్యక్రమాలు విజయవంతమవటానికి, అభ్యర్థుల గెలుపునకు తెరవెనుక కీలక పాత్ర పోషించారు. దీంతో ఆయనకు మంత్రి పదవి రావడం ఖాయమనే చర్చ నడుస్తోంది.
Similar News
News November 1, 2025
దేవుడు సొమ్ము సైతం గోల్‌మాల్..?

నాగులుప్పలపాడు (M) మట్టిగుంట శివాలయ వ్యవసాయ భూమి 41.5 సెంట్ల ద్వారా వచ్చే ఆదాయంలో సుమారు రూ.70 లక్షలు గల్లంతైనట్లు గ్రామస్థులు ఆరోపించారు. ఏటా రూ.10 లక్షలకు పైగా కౌలు ఆదాయం వస్తున్నా 6 నెలలుగా అర్చకులకు జీతాలు ఇవ్వడం లేదన్నారు. శుక్రవారం నిర్వహించిన సమావేశంలో రికార్డులు చూపించడంలో ప్రస్తుత EO విఫలమైనట్లు పలువురు ఆరోపించారు. రికార్డుల నిర్వహణ లోపం వల్ల ఆదాయానికి గండి పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

News October 31, 2025
నవంబర్ 30 వరకు యాక్ట్ 30 అమలు: DSP

ప్రకాశం జిల్లాలో నవంబర్ 1 నుంచి 30 వరకు యాక్ట్ 30 అమల్లో ఉంటుందని ఒంగోలు DSP రాయపాటి శ్రీనివాసరావు శుక్రవారం వెల్లడించారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం పోలీస్ శాఖ తీసుకున్న నిర్ణయానికి అందరూ సహకరించాలని కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.