News November 11, 2024
చంద్రశేఖరన్‌తో మంత్రి టీజీ భరత్ సెల్ఫీ

టాటా సన్స్ గ్రూప్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌ను మంత్రి టీజీ భరత్ కలిశారు. కారులో ఆయనతో సెల్ఫీ తీసుకున్నారు. విలువైన వ్యక్తిని కలవడం స్ఫూర్తిదాయకంగా భావిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఆయన పంచుకునే జ్ఞానం తనను నిరంతరం ఆకట్టుకుంటోందని కొనియాడారు. వ్యక్తిగత, వృత్తిపరమైన ఎదుగుదలకు కట్టుబడి ఉన్న వ్యక్తిని కలుసుకోవడం సంతోషంగా ఉందంటూ ఆయన ట్వీట్ చేశారు.
Similar News
News January 2, 2026
94 వేల కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ: కలెక్టర్

కర్నూలు జిల్లాలోని 141 గ్రామాల్లో జనవరి 2 నుంచి 9 వరకు నిర్వహించే రెవెన్యూ గ్రామ సభలలో రైతులకు రాజముద్రతో కూడిన 94,090 నూతన పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. పాత భూహక్కు పత్రాల స్థానంలో ఇవి అందజేస్తామని పేర్కొన్నారు. శుక్రవారం కల్లూరు మండలం తడకనపల్లెలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రైతులకు పాస్‌పుస్తకాలు అందజేశారు.
News January 2, 2026
కర్నూల్: కలెక్టర్ బంగ్లాలో న్యూ ఇయర్ వేడుకలు

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కలెక్టర్ బంగ్లాలో రెవెన్యూ, విద్యాశాఖ, పోలీస్ శాఖలతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ సందర్భంగా 2026లో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. సలహాలు సూచనలు చేశారు.