News September 6, 2025
చంద్ర గ్రహణం కారణంగా పౌర్ణమి గరుడసేవ రద్దు

సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కారణంగా తిరుమలలో ప్రతి నెలా నిర్వహించే పౌర్ణమి గరుడ సేవను టీటీడీ రద్దు చేసింది. ఈ మేరకు శనివారం టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. అదేవిధంగా ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను కూడా రద్దు చేయడం జరిగిందనీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా టిటిడి విజ్ఞప్తి చేసింది.
Similar News
News September 6, 2025
బాపట్ల: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి

బైక్, లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన బాపట్ల మండలంలో శనివారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. కొండుబోట్లపాలెం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై లారీ, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇరువురు యువకులు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. తీవ్ర గాయాలైన మరొక వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 6, 2025
నల్గొండ: ‘శ్రద్ధగా విధులు నిర్వర్తించాలి’

గ్రామ పాలనాధికారులు తమ పనిపై పూర్తి శ్రద్ధ వహించి విధులు నిర్వర్తించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. శనివారం కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో నిర్వహించిన గ్రామ పాలనాధికారుల కౌన్సెలింగ్‌లో ఆమె పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కౌన్సెలింగ్‌ను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, ఎలాంటి సిఫారసులకు, పక్షపాతానికి ఇందులో తావు లేదని అన్నారు. సోమవారం నాటికి వంద శాతం మంది విధుల్లో చేరాలని ఆమె ఆదేశించారు.
News September 6, 2025
హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం అప్డేట్స్

* ఇప్పటివరకు 2,54,685 వినాయక విగ్రహాల నిమజ్జనం పూర్తి
* హుస్సేన్ సాగర్ వద్ద అట్టహాసంగా సాగుతున్న ప్రక్రియ. గంగమ్మ ఒడికి చేరిన 10వేల విగ్రహాలు
* మరో 4,500 పెద్ద విగ్రహాల నిమజ్జనం కావాల్సి ఉందన్న సీపీ సీవీ ఆనంద్
* నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్‌లో రేపు తెల్లవారుజాము 4.40 గంటల వరకు నడవనున్న MMTS రైళ్లు