News September 4, 2024
చక్రాయపేట: గండి ఆలయ హుండీల లెక్కింపు

పుణ్యక్షేత్రమైన గండిలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో బుధవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆలయ సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య తెలిపారు. కడప దేవాదాయశాఖ సూపరింటెండెంట్ రమణమ్మ పర్యవేక్షణలో 55 రోజులుగా భక్తులు స్వామివారికి హుండీల ద్వారా సమర్పించిన కానుకలను లెక్కించినట్లు తెలిపారు. 7 శాశ్వత హుండీల ద్వారా రూ. 36,48,364, అన్నప్రసాద వితరణ హుండీ ద్వారా రూ. 62,317ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు.
Similar News
News September 16, 2025
మైదుకూరు: ఫైనాన్స్ సిబ్బంది వేధింపులు.. యువకుడు ఆత్మహత్య

మైదుకూరు పట్టణం సాయినాథపురం గ్రామానికి చెందిన రమేశ్ అనే యువకుడు ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. సోమవారం మృతి చెందాడు. రమేశ్ తన ఇంటి అవసరాల కోసం ఫైనాన్స్ కంపెనీ వద్ద రుణం తీసుకున్నాడు. రుణాలు చెల్లించకపోవడంతో కంపెనీ సిబ్బంది ఒత్తిడి తెచ్చారు. ఒత్తిడిని తట్టుకోలేక ఈ అఘాయిత్యనికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News September 16, 2025
ప్రొద్దుటూరు చరిత్రలోనే కాస్ట్లీ ఎగ్జిబిషన్ ఇదే!.

ప్రొద్దుటూరు చరిత్రలోనే కాస్ట్లీ ఎగ్జిబిషన్‌తో మున్సిపాలిటీకి రూ.1,91,44,00లు, ఆర్థిక శాఖకు జీఎస్టీ రూపంలో రూ.34,45,920లు ఆదాయం లభించనుంది. మొత్తంగా ప్రభుత్వానికి రూ.2,25,89,920లు ఆదాయం సమకూరుతుంది. దసరా ఉత్సవాల్లో రెండవ మైసూరుగా పేరుగాంచిన ప్రొద్దుటూరులో ప్రతి దసరా సమయంలోనూ మున్సిపల్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. దీనివల్ల మున్సిపాలిటీకి, జీఎస్టీ శాఖకు ఆదాయం లభిస్తోంది.