News January 11, 2026
చచ్చిపోవాలనే ఆలోచనల నుంచి అలా బయటపడ్డా: మలయాళ నటి

డిప్రెషన్‌లో ఉన్న సమయంలో మానసిక చికిత్స తీసుకోవడం చాలా అవసరమని హీరోయిన్ పార్వతీ తిరువోతు అన్నారు. ఒకానొక సమయంలో తీవ్రమైన ఒంటరితనంతో బాధపడ్డానని, ఆ టైమ్‌లో చచ్చిపోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయని తెలిపారు. థెరపీ తీసుకోవడంతో దాని నుంచి బయటపడినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తనను బాధపెట్టిన 2021లోని జనవరి, ఫిబ్రవరి నెలలను జీవితం నుంచి తీసేసినట్లు చెప్పారు. ఈ మలయాళ బ్యూటీ నాగచైతన్య ‘దూత’లో నటించారు.
Similar News
News February 8, 2026
కేసీఆర్ ఫొటోకు అజహరుద్దీన్ దండం పెట్టాలి: హరీశ్ రావు

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో తాము ప్రశ్నించినందుకే అజహరుద్దీన్‌కు సీఎం రేవంత్ మంత్రి పదవి ఇచ్చారని హరీశ్ రావు పేర్కొన్నారు. కేసీఆర్ ఫొటోకు అజహరుద్దీన్ దండం పెట్టాలని అన్నారు. ఆయనకు మంత్రి పదవి వచ్చి 3 నెలలైనా ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని, ఇంకో 3 నెలల్లో ఇవ్వకపోతే మినిస్టర్ పదవి పోతుందని వ్యాఖ్యానించారు. తనకు వంద నోటీసులు ఇచ్చినా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆపనని స్పష్టం చేశారు.
News February 8, 2026
భారత్-పాక్ మ్యాచ్.. కాసేపట్లో నిర్ణయం!

టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకున్న విషయం తెలిసిందే. వారికి మద్దతుగా టీమ్ ఇండియాతో తాము మ్యాచ్ ఆడబోమని పాక్ ప్రధాని షరీఫ్ ప్రకటించారు. అయితే PCB మనసు మార్చుకున్నట్లు సమాచారం. ఈనెల 15న కొలంబో వేదికగా భారత్‌తో జరగనున్న మ్యాచ్‌లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో ICC అఫీషియల్స్-PCB సభ్యులు భేటీకానున్నారు. ఈ సమావేశం ముగిశాక అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
News February 8, 2026
షుగర్ కంట్రోల్‌కు బెస్ట్ ఫుడ్స్ ఇవే..

బ్లడ్ షుగర్ లెవెల్స్‌పై ప్రభావం చూపే ఫుడ్స్‌కు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి రేటింగ్ ఇచ్చారు. ప్రొటీన్, ఫైబర్ అధికంగా ఉండే గుడ్లు, పచ్చని కూరగాయలు (10/10) మేటి ఆహారాలుగా నిలిచాయి. నట్స్ (9/10), బెర్రీలు (8/10) షుగర్ పెరగకుండా కంట్రోల్ చేస్తాయి. అయితే వైట్ రైస్ (3/10), ఫ్రూట్ జ్యూస్ (2/10) రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతాయని, షుగరీ డ్రింక్స్ (0/10) చాలా డేంజర్ అని హెచ్చరించారు.


